ISRO: 40 అంతస్తుల భారీ రాకెట్

ISRO

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో విశేష ప్రాజెక్టుతో ముందుకు సాగుతోంది. ఇస్రో చైర్మన్ వీ. నారాయణన్ తెలిపారు ప్రకారం, ప్రస్తుతం 40 అంతస్తుల భవనంత ఎత్తైన రాకెట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. (ISRO) ఈ విషయాన్ని ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని వెల్లడించారు.

ఇస్రో ముందున్న కొత్త ప్రాజెక్టులు

నారాయణన్ మాట్లాడుతూ ఈ ఏడాది ఇస్రో పలు కీలక ప్రయోగాలకు సిద్ధమవుతోందని తెలిపారు. వాటిలో:

  • నావిక్ ఉపగ్రహం ప్రయోగం

  • ఎన్-1 రాకెట్ ప్రయోగం

  • అమెరికాకు చెందిన 6,500 కిలోల కమ్యూనికేషన్ శాటిలైట్‌ను కక్ష్యలోకి పంపడం

ఇవి సమీప భవిష్యత్తులో చేపట్టబోయే ప్రధాన ప్రాజెక్టులని ఆయన వివరించారు.

Image

గతం నుంచి భవిష్యత్తు వరకు నారాయణన్ మాట్లాడుతూ, అబ్దుల్ కలాం రూపకల్పన చేసిన తొలి రాకెట్ కేవలం 17 టన్నుల లిఫ్ట్-ఆఫ్ బరువుతో, 35 కిలోల ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చిందని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు ఇస్రో లక్ష్యం 75,000 కిలోల బరువైన పేలోడ్‌ను భూ కక్ష్యకు చేర్చడం అని తెలిపారు. దీనికోసం భవనంత ఎత్తైన రాకెట్ నిర్మాణంలో ఉన్నామని చెప్పారు.

భారత ఉపగ్రహాల సంఖ్య పెరుగుదల

ప్రస్తుతం భారత కక్ష్యలో 55 ఉపగ్రహాలు ఉన్నాయని, రాబోయే మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లో ఈ సంఖ్య మూడింతలు లేదా నాలుగింతలు పెరుగుతుందని నారాయణన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

గౌరవ డాక్టరేట్‌

ఈ సందర్భంగా ఆయనకు గౌరవ డాక్టరేట్ ను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ప్రదానం చేశారు. భారత అంతరిక్ష కార్యక్రమానికి ఆయన చేసిన విశేష సేవలకు ఈ గౌరవం దక్కిందని పేర్కొన్నారు.

Also Read :