కేంద్రం ప్రభుత్వం ఇవాళ 129వ రాజ్యాంగ సవరణ కింద ఒకే దేశం– ఒకే ఎన్నికలు (Jamili) బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఎన్డీఏ కూటమిలోని పార్టీలు సమర్థిస్తుండగా.. కాంగ్రెస్, విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ (Jamili) బిల్లును జేపీసీకి పంపడంపై ఓటింగ్ జరగగా.. 220 మంది సమర్థించారు. 149 మంది వ్యతిరేకించారు. అంతకు ముందు ఈ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఎస్పీ ఎంపీ ధర్మేంద్రయాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ తివారీకి మద్దతుగా నిలిచారు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఒక్కసారి నిర్వహించలేదని కేంద్రం దేశవ్యాప్తంగా ఎన్నికలు ఒకే దఫా జరుపుతామనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ దేశంలోని భిన్నత్వాన్ని అంతం చేస్తుందని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. జమిలీ ఎన్నికల వల్ల అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. కల్యాణ్ బెనర్జీ మాట్లాడతూ ఇది రాష్ట్రాల అసెంబ్లీల స్వాతంత్య్రాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు.
కేంద్రం ప్రభుత్వం ఇవాళ 129వ రాజ్యాంగ సవరణ కింద ఒకే దేశం– ఒకే ఎన్నికలు బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఎన్డీఏ కూటమిలోని పార్టీలు సమర్థిస్తుండగా.. కాంగ్రెస్, విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లును జేపీసీకి పంపడంపై ఓటింగ్ జరగగా.. 220 మంది సమర్థించారు. 149 మంది వ్యతిరేకించారు. అంతకు ముందు ఈ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఎస్పీ ఎంపీ ధర్మేంద్రయాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ తివారీకి మద్దతుగా నిలిచారు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఒక్కసారి నిర్వహించలేదని కేంద్రం దేశవ్యాప్తంగా ఎన్నికలు ఒకే దఫా జరుపుతామనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ దేశంలోని భిన్నత్వాన్ని అంతం చేస్తుందని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. జమిలీ ఎన్నికల వల్ల అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. కల్యాణ్ బెనర్జీ మాట్లాడతూ ఇది రాష్ట్రాల అసెంబ్లీల స్వాతంత్య్రాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు.
బిల్లును ఉపసంహరించుకోవాలి
కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టిన వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ డిమాండ్ చేశారు. ఈ మేరకు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు.
Also read:

