పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేశాడనే ఆరోపణలపై అరెస్టైన యూట్యూబర్ జ్యోతీ మల్హోత్రా గతంలో కేరళ (Kerala) పర్యాటక శాఖ చేపట్టిన అధికారిక ప్రచార కార్యక్రమాల్లో భాగమైనట్టు తాజాగా వెల్లడి కావడం తీవ్ర సంచలనంగా మారింది. (Kerala) ఈ అంశం సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా వెలుగులోకి వచ్చింది.
కేరళ ప్రభుత్వం స్పాన్సర్ చేసిన ప్రచారం
దక్షిణాది రాష్ట్రాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కేరళ పర్యాటక శాఖ 41 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఆహ్వానించింది. వారిలో జ్యోతీ మల్హోత్రా కూడా ఉన్నారు. ఈ పర్యటనకు సంబంధించిన అన్ని ఖర్చులు — ప్రయాణం, వసతి, ఆహారం — కేరళ ప్రభుత్వం సమకూర్చింది. అంతేకాదు, వీడియోల చిత్రీకరణకు అవసరమైన సాంకేతిక సహాయం అందించేందుకు ప్రైవేట్ మీడియా ఏజెన్సీని కూడా నియమించారు.
జ్యోతీ మల్హోత్రా పర్యటన వివరాలు
జ్యోతీ మల్హోత్రా ఈ పర్యటనలో కొచ్చి, కన్నూర్, అలప్పుజ, కోజికోడ్, మున్నార్, తిరువనంతపురం వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. ఈ ప్రచారంలో భాగంగా జ్యోతీ తీసిన వీడియోలు పర్యాటక శాఖ అధికారిక ఛానళ్లలోనూ ప్రచురితమయ్యాయి.
ప్రతిపక్షాల విమర్శలు – ప్రభుత్వం పై విరుచుకుపడిన విమర్శలు
ఈ వివరణ బయటపడిన వెంటనే కేరళ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సరైన వెరిఫికేషన్ లేకుండానే విదేశీ సంబంధాలున్న వ్యక్తులను రాష్ట్రానికి ఆహ్వానించడంపై మండిపడుతున్నారు. జాతీయ భద్రతను ప్రమాదంలో పడేసే విధంగా వ్యవహరించారంటూ ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ సమాధానం
కేరళ పర్యాటక శాఖ మంత్రి పీఏ మహమ్మద్ రియాస్ స్పందిస్తూ, ఈ పర్యటనలో జ్యోతీ మల్హోత్రా మాత్రమే కాకుండా అనేక మంది ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్లను ఆహ్వానించామని తెలిపారు. ఆ సమయంలో ఆమెపై ఎలాంటి నెగెటివ్ రికార్డు లేదు, ఆ తర్వాత వచ్చిన సమాచారం నేపథ్యంలో ఇది సమస్యగా మారిందని మంత్రి వివరణ ఇచ్చారు.
Also read: