హైకోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు
కర్ణాటక (Karnataka) ప్రభుత్వం బైక్ ట్యాక్సీలను నిషేధించడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టింది. నగర ప్రజలకు ఈ సేవ అవసరమని, ముఖ్యంగా మధ్యతరగతి వర్గానికి బైక్ ట్యాక్సీలు ఎంతో (Karnataka) ఉపయోగకరమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విభు బక్రు నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది.
13 రాష్ట్రాల్లో సేవ
దేశంలోని 13 రాష్ట్రాల్లో ఇప్పటికే బైక్ ట్యాక్సీలు నడుస్తున్నాయని కోర్టు గుర్తు చేసింది. మోటారు వాహనాల చట్టం బైక్ ట్యాక్సీలను నిషేధించదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చూపించిన వాదనను తోసిపుచ్చింది.
జీవనోపాధిపై ప్రభావం
బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించడం వల్ల వాటిపైనే ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడతాయని కోర్టు హెచ్చరించింది. ఇది రాజ్యాంగంలోని జీవనోపాధి హక్కును హరించడం అవుతుందని వ్యాఖ్యానించింది. ఆ అధికారం ఎవరికీ లేదని తీవ్రంగా ఎత్తి చూపింది.
ప్రభుత్వంపై ప్రశ్నలు
రాష్ట్రం ఉద్దేశపూర్వకంగా ఈ విధానాన్ని తీసుకుందా అని కోర్టు అడ్వకేట్ జనరల్‌ను ప్రశ్నించింది. బైక్ ట్యాక్సీ డ్రైవర్లపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
తదుపరి విచారణ
ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 22కి వాయిదా వేసినట్లు హైకోర్టు తెలిపింది.
FurtherMore:

