- పదేండ్ల నుంచి కేటీఆర్ ను ఎట్లా సీఎం చేయాలన్నదే ఆలోచన
- మజ్లిస్ చేతిలో కారు స్టీరింగ్.. ఆ సర్కారును పీకి పారేద్దాం
- అవినీతి, కుంభకోణాల మయంగా బీఆర్ఎస్ సర్కారు
- పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నది మోదీ ప్రభుత్వమే
- తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి
- గిరిజన వర్సిటీకి కేసీఆర్ సర్కారు సహకరించలే.. జాగా ఇవ్వలే
- ఆదిలాబాద్ జనగర్జన సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah)
హైదరాబాద్/ఆదిలాబాద్: బిడ్డ, కొడుకు కోసమే కేసీఆర్ పనిచేస్తున్నారని, కొడుకును ఎలా సీఎం చేయాలని పదేండ్లుగా ఆలోచిస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. ఇవాళ ఆదిలాబాద్ జనగర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ గుర్తు కారు అని, ఆ కారు స్టీరింగ్ మజ్లిస్ పార్టీ చేతిలో ఉందని అన్నారు. అలాంటి సర్కారు మనకు అవసరామా అని ప్రశ్నించారు. స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉన్న కారు పార్టీని ఓడిద్దామని అన్నారు. కాంగ్రెస్ లీడర్లు ఎన్నికలు వచ్చినప్పుడే కొత్త బట్టలు వేసుకొని వస్తారని వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అవినీతి కుంభకోణాల్లో తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందని చెప్పారు. బిడ్డ, కొడుకు లను బాగు చేయాలనుకున్న సర్కారు ఉన్నంత కాలం ఈ రాష్ట్రం బాగుపడదని అన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కారు తీసుకొద్దామని పిలుపునిచ్చారు. కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని నెరవేర్చలేదనిన అన్నారు. దళితబంధు పథకాన్ని పార్టీ నాయకులకే ఇచ్చుకున్నారని, సామాన్యులకు అందలేదని విమర్శించారు. కొలువు ఇస్తామని నిరుద్యోగులకు ఆశ చూపి ఆ హామీ నెరవేర్చలేదని చెప్పారు. ఇటీవలే తెలంగాణకు ప్రధాని మోదీ లబ్ధి చేకూర్చారని, ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న గిరిజన వర్సిటీని కేటాయించారన్నారు. ఈ వర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించనందునే జాప్యం జరిగిందని చెప్పారు. పసుపు బోర్డును ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు మేలు చేసిందని వివరించారు. ఏది మాట్లాడినా సీఎం కేసీఆర్ తెలంగాణ నంబర్ వన్ అని చెబుతున్నారన్నారు. తెలంగాణను నిరుద్యోగం, అవినీతి, కుంభకోణాల్లో నంబర్ వన్ గా నిలిపారని విమర్శించారు.
డబుల్ ఇంజిన్ తోనే అభివృద్ధి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీని గెలిపించాలని కోరారు. డబుల్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. కరోనా కష్ట సమయంలో అందరికీ ఉచితంగా టీకాలు అందించిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కిందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సర్కారు ఏర్పాటు చేద్దామా..? కమలం గుర్తుపై ఓటేద్దామా..? కేసీఆర్ సర్కారున పీకి పారేద్దామా..? 2024లో మోదీని మరోసారి ప్రధాని చేద్దామా..? నరేంద్ర మోదీకి నేతృత్వంలో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేద్దామా..? అని ప్రశ్నిస్తూ సభికులను ఉత్సాహ పరిచారు.
Also Read: