Khumbhamela: మృతుల లెక్కలు దాస్తుండ్రు

Khumbhamela

మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళాలో (Khumbhamela) చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్యను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దాస్తోందని లోక్ సభ సభ్యుడు, ఎస్పీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఇవాళ లోక్ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరంతరం బడ్జెట్‌ గణాంకాలు ఇస్తూనే ఉందని, అలానే మహాకుంభమేళాలో (Khumbhamela) మరణించిన వారి గణాంకాలు సైతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడి ఏర్పాట్లపై స్పష్టత ఇవ్వడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కుంభమేళా నిర్వహణ బాధ్యతలు ఆర్మీకి అప్పగించాలని డిమాండ్‌ చేస్తున్నట్టు అఖిలేశ్ చెప్పారు. మృతుల సంఖ్య, క్షతగాత్రులకు అందించిన వైద్యం, మందులు, ఆహారం, రవాణా వంటి అన్ని వివరాలను పార్లమెంటులో సమర్పించాలన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నిజాన్ని దాచిన వారిని శిక్షించాలని డబుల్ ఇంజిన్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. నేరం లేకుంటే ఆ గణాంకాలను ఎందుకు దాచారని అఖిలేశ్ ప్రశ్నించారు.

మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్యను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దాస్తోందని లోక్ సభ సభ్యుడు, ఎస్పీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఇవాళ లోక్ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరంతరం బడ్జెట్‌ గణాంకాలు ఇస్తూనే ఉందని, అలానే మహాకుంభమేళాలో మరణించిన వారి గణాంకాలు సైతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడి ఏర్పాట్లపై స్పష్టత ఇవ్వడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కుంభమేళా నిర్వహణ బాధ్యతలు ఆర్మీకి అప్పగించాలని డిమాండ్‌ చేస్తున్నట్టు అఖిలేశ్ చెప్పారు. మృతుల సంఖ్య, క్షతగాత్రులకు అందించిన వైద్యం, మందులు, ఆహారం, రవాణా వంటి అన్ని వివరాలను పార్లమెంటులో సమర్పించాలన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నిజాన్ని దాచిన వారిని శిక్షించాలని డబుల్ ఇంజిన్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. నేరం లేకుంటే ఆ గణాంకాలను ఎందుకు దాచారని అఖిలేశ్ ప్రశ్నించారు.

Also read: