మిజోరాం (Mizoram) అసెంబ్లీలో చరిత్రాత్మక తీర్మానం ఆమోదం పొందింది. రాష్ట్ర ప్రభుత్వం **”మిజోరాం భిక్షావృత్తి నిషేధ బిల్లు–2025″**ను ఆమోదించింది. (Mizoram)
ప్రతిపక్ష అభ్యంతరాలు
ఈ బిల్లుకు ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా కూడా, సామాజిక సంక్షేమ మంత్రి లాలరిన్‌పుయే బిల్లును ప్రవేశపెట్టారు.
బిల్లుతో లక్ష్యం
“ఈ బిల్లు కేవలం భిక్షాటన ఆపడం కోసం కాదు. భిక్షుకులకు కొత్త జీవన మార్గం చూపించడమే అసలు లక్ష్యం” అని మంత్రి స్పష్టం చేశారు.
మిజోరాంలో భిక్షావృత్తి పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇతర రాష్ట్రాలతో పోల్చితే
చర్చిలు, స్వచ్ఛంద సంస్థలు, సంక్షేమ పథకాల మద్దతుతో మిజోరాంలో భిక్షుకుల సంఖ్య తక్కువగా ఉంది. అయితే కొత్త రైల్వే మార్గం ప్రారంభం తర్వాత పరిస్థితి మారే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
రైల్వే ప్రభావం
సెరాంగ్–సిహ్ముయ్ రైల్వే స్టేషన్ ప్రారంభమైన తర్వాత, ఇతర రాష్ట్రాల నుంచి భిక్షుకులు మిజోరాంలోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ రైల్వే లైన్‌ను సెప్టెంబర్ 13న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అందుకే నియంత్రణ కోసం కొత్త చట్టం అవసరమని ప్రభుత్వం నిర్ణయించింది.
రీలీఫ్ బోర్డు & రిసీవింగ్ సెంటర్
భిక్షుకుల రక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక రీలీఫ్ బోర్డు ఏర్పడనుంది.
అదే విధంగా, తాత్కాలికంగా భిక్షుకులను ఉంచేందుకు ‘రిసీవింగ్ సెంటర్’ ఏర్పాటు చేయనున్నారు.
అక్కడ 24 గంటలలోపు వారిని ఉంచి, వారి స్వగ్రామాలకు లేదా స్వరాష్ట్రాలకు పంపేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
Also read:

