PM Modi: అమ్మ యాదికొస్తుంది!

Modi

నేను ప్రతి సారి నామినేషన్ వేసేందుకు వెళ్లేటప్పుడు అమ్మ ఆశీర్వాదం తీసుకునే వాడిని.. అమ్మనాకు బెల్లం తినిపించి ఆశీర్వదించి పంపేది.. ఇప్పుడా అవకాశంలేదు.. ఎందుకంటే అమ్మలేదు కాబట్టి.. మొదటి సారి అమ్మచేతి బెల్లం తినకుండా నామినేషన్ వేశాను.. అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రధాన మంత్రి మోదీ(PM Modi).. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుండి హ్యాట్రిక్ విజయం కోసం పోటీ పడుతున్న ప్రధాని మోడీ(PM Modi), తన తల్లి ఆశీర్వాదం తీసుకోకుండా పోటీ చేస్తుండటం బాధగా ఉందన్నారు. జాతీయ మీడియా చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మాట్లాడారు. ‘మా అమ్మ నాకు జన్మనిచ్చింది. కానీ నేను ఆమెకు న్యాయం చేయలేదు. నేను చేయలేదు. ప్రతి తల్లి తన బిడ్డ ఎదగాలని కలగంటుంది.. ఆశిస్తుంది.. అమ్మ కలను సాకారం చేయడానికి నేను ఆమె వెంట లేను.. చిన్న వయస్సులోనే ఇంటిని విడిచిపెట్టాను. రాష్ట్రానికి చేరుకున్న తర్వాత, నేను మొట్టమొదట అమ్మను కలిశాను’అని గుర్తు చేసుకున్నారు. తొలిసారి నామినేషన్ దాఖలు చేసినప్పుడు జరిగిన సంఘటనలను వివరిస్తూ.. నామినేషన్ దాఖలు చేసే ముందు తన తల్లి పాదాలను తాకి ఆశీస్సులు కోరినట్లు తెలిపారు. అప్పుడు తల్లి (హీరాబెన్) తనకు బెల్లం తినిపించిందని గుర్తు చేసుకున్నారు. “అప్పటి నుంచి నేను అమ్మ పాదాలు తాకిన తర్వాతే నామినేషన్ దాఖలు చేశాను. ఎప్పుడూ నాకు బెల్లం తినిపించేది. నేను నా జీవితంలో అమ్మ పాదాలు తాకకుండా నామినేషన్ దాఖలుకు వెళ్లడం ఇదే తొలిసారి.’ అంటూ మోదీ ఎమోషన్ అయ్యారు.

నేను ప్రతి సారి నామినేషన్ వేసేందుకు వెళ్లేటప్పుడు అమ్మ ఆశీర్వాదం తీసుకునే వాడిని.. అమ్మనాకు బెల్లం తినిపించి ఆశీర్వదించి పంపేది.. ఇప్పుడా అవకాశంలేదు.. ఎందుకంటే అమ్మలేదు కాబట్టి.. మొదటి సారి అమ్మచేతి బెల్లం తినకుండా నామినేషన్ వేశాను.. అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రధాన మంత్రి మోదీ.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుండి హ్యాట్రిక్ విజయం కోసం పోటీ పడుతున్న ప్రధాని మోడీ, తన తల్లి ఆశీర్వాదం తీసుకోకుండా పోటీ చేస్తుండటం బాధగా ఉందన్నారు. జాతీయ మీడియా చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మాట్లాడారు. ‘మా అమ్మ నాకు జన్మనిచ్చింది. కానీ నేను ఆమెకు న్యాయం చేయలేదు. నేను చేయలేదు. ప్రతి తల్లి తన బిడ్డ ఎదగాలని కలగంటుంది.. ఆశిస్తుంది.. అమ్మ కలను సాకారం చేయడానికి నేను ఆమె వెంట లేను.. చిన్న వయస్సులోనే ఇంటిని విడిచిపెట్టాను. రాష్ట్రానికి చేరుకున్న తర్వాత, నేను మొట్టమొదట అమ్మను కలిశాను’అని గుర్తు చేసుకున్నారు. తొలిసారి నామినేషన్ దాఖలు చేసినప్పుడు జరిగిన సంఘటనలను వివరిస్తూ.. నామినేషన్ దాఖలు చేసే ముందు తన తల్లి పాదాలను తాకి ఆశీస్సులు కోరినట్లు తెలిపారు. అప్పుడు తల్లి (హీరాబెన్) తనకు బెల్లం తినిపించిందని గుర్తు చేసుకున్నారు. “అప్పటి నుంచి నేను అమ్మ పాదాలు తాకిన తర్వాతే నామినేషన్ దాఖలు చేశాను. ఎప్పుడూ నాకు బెల్లం తినిపించేది. నేను నా జీవితంలో అమ్మ పాదాలు తాకకుండా నామినేషన్ దాఖలుకు వెళ్లడం ఇదే తొలిసారి.’ అంటూ మోదీ ఎమోషన్ అయ్యారు.

Also read: