యూపీ(Uttar Pradesh) వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో పోలీసులు ధోతీ కుర్తా, మహిళా పోలీసులు సల్వార్ కుర్తాతో.. మెడలో రుద్రాక్ష మాల ధరించి అర్చకుల వేషదారణతో విధులు నిర్వర్తించడం తీవ్ర వివాదానికి దారి తీస్తోంది. ఈ నిర్ణయాన్ని యూపీ(Uttar Pradesh) మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆలయంలో పోలీసుల డ్రెస్ కోడ్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు అర్చకుల మాదిరిగా డ్రెస్ కోడ్ ధరించాలని ఏ పోలీసు మ్యానువల్‌లో ఉందని ప్రశ్నించారు. ఆ ఉత్తర్వులు ఇచ్చిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీన్ని అవకాశంగా తీసుకుని రేపేవరైనా మోసాలకు పాల్పడితే? ప్రజలను దోపిడీ చేస్తే? యూపీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు. అటు సామాజిక మాధ్యమాల్లోనూ యోగి సర్కారుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నిర్ణయాన్ని పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ సమర్థించుకున్నారు. పోలీసులు అర్చకుల మాదిరిగా కనిపిస్తే భక్తులు సానుకూల కోణంలో ఆలోచించే అవకాశం ఉంటుందని తెలిపారు. అందుకే డ్రెస్‌కోడ్‌ను మార్చినట్లు వెల్లడించారు.
Also read :
K Kavitha : కవిత అరెస్టు అక్రమం కాదు
Kavitha : సీబీఐ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత

