ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన రోహిత్ శర్మ(Rohith sharma)టీమ్ ఇండియా(TEAM INDIA) క్రికెట్(CRICKET) జట్టుకు కెప్టెన్ స్థాయికి ఎదిగాడంటే దాని వెనుక ఎంతో కష్టం ఉంది. క్రికెటర్ గా ఎదగడానికి రోహిత్ శర్మ (Rohith sharma) ఎంతో కష్టపడ్డాడని టీమిండియా మాజీ ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా(PRAGNAN OJHA) చెబుతున్నాడు. రోహిత్ ఎదిగిన తీరును చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని అంటున్నాడు కొత్త క్రికెట్ కిట్ కొనేందుకు రోహిత్ పాల ప్యాకెట్ల డెలివరీ చేశాడని ఓజా అంటున్నాడు.
అండర్ – 15 క్రికెట్ స్థాయి నుంచి రోహిత్, ఓజా కలిసి ఆడారు. ఆ టైమ్ లో ఆటలో దూకుడుగా ఉండే రోహిత్ పెద్దగా మాట్లాడేవాడు కాదన్నాడు. కొన్ని రోజులకు తమ మధ్య స్నేహం పెరిగిందని చెప్పాడు. అయితే ఓ సారి క్రికెట్ కిట్ బడ్జెట్ పై చర్చ జరుగుతుండగా రోహిత్ భావోద్వేగానికి గురయ్యాడని ఓజా తెలిపాడు.
కొత్త కిట్ కోసం పాల ప్యాకెట్ల డెలివరీ కూడా చేశాశని రోహిత్ తనతో చెప్పినట్లుగా వెల్లడించాడు. .ఓజా, రోహిత్ కలిసి భారత్ తరఫున 24 మ్యాచ్‌లు ఆడారు. ఐపీఎల్‌లో డెక్కన్ చార్జర్స్ జట్టుకు ఆడిన వీరిద్దరూ తర్వాత ముంబయి ఇండియన్స్ వెళ్లిపోయారు. ఓజాకు 2015 సీజన్ చివరిది కాగా.. రోహిత్ ప్రస్తుతం ముంబయి ఇండియన్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్నాడు.
ALSO READ
WPL2023: తొలి పోరులో ముంబై గ్రాండ్ విక్టరీ
VIRUSHKA:ఉజ్జయినిలో విరుష్క పూజలు