Amethi: అమేథీ నుంచి రాబర్ట్ వాద్రా?

Amethi

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పోటీ చేయబోరని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. అమేథీ (Amethi) నుంచి రాహుల్ గాంధీ, రాయ్ బరేలి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరగుతున్న విషయం తెలిసిందే. పోటీకి ప్రియాంక విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అమేథీ (Amethi) నుంచి పోటీ చేసేందుకు ప్రియాంక భర్త రాబర్ట్ వధ్రా ఆసక్తిచూపుతున్నారని సమాచారం. కేవలం ఒక సీటు నుంచి పోటీ చేయకుండా.. తాను దేశమంతా ప్రచారం చేస్తేనే పార్టీకి మంచి ఫలితాలొస్తాయని ప్రియాంక భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. అంతేగాక, తాను పోటీ చేస్తే వారసత్వంపై విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్‌ నాయకురాలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అందుకే, ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగకుండా విస్తృత ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మే 3వ తేదీ నుంచి ఆమె యూపీలో ప్రచారం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక ఎన్నికలకు దూరంగా ఉంటే రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే సందిగ్ధత నెలకొంది. ఇక్కడ కూడా రాహుల్‌ గాంధీ పేరే వినిపిస్తోంది. అమేథీ లేదా రాయ్‌బరేలీ నుంచి ఆయన పోటీపై 24 గంటల్లో హైకమాండ్‌ నిర్ణయం తీసుకోనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు స్థానాలకు మే 20న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లను మే3వ తేదీ వరకు వేయొచ్చు.

కేవలం ఒక సీటు నుంచి పోటీ చేయకుండా.. తాను దేశమంతా ప్రచారం చేస్తేనే పార్టీకి మంచి ఫలితాలొస్తాయని ప్రియాంక భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. అంతేగాక, తాను పోటీ చేస్తే వారసత్వంపై విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్‌ నాయకురాలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అందుకే, ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగకుండా విస్తృత ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మే 3వ తేదీ నుంచి ఆమె యూపీలో ప్రచారం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక ఎన్నికలకు దూరంగా ఉంటే రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే సందిగ్ధత నెలకొంది. ఇక్కడ కూడా రాహుల్‌ గాంధీ పేరే వినిపిస్తోంది. అమేథీ లేదా రాయ్‌బరేలీ నుంచి ఆయన పోటీపై 24 గంటల్లో హైకమాండ్‌ నిర్ణయం తీసుకోనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు స్థానాలకు మే 20న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లను మే3వ తేదీ వరకు వేయొచ్చు.

Also read:

Also read: