నాంపల్లిలో (Nampally) ఉద్రిక్తత కొనసాగుతోంది. వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఢిల్లీ బీజేపీ సీనియర్ నేత రమేశ్ బిదూరి చేసిన అనుచిత వ్యాఖ్యలు గొడవకు కారణమయ్యాయి. ఇవాళ ఉదయం కాంగ్రెస్ కార్యకర్తలు (Nampally) నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లారు. అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు ఎదురు దాడి చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీసుపైకి రాళ్లు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ శ్రేణులు కర్రలతో కాంగ్రెస్ కార్యకర్తల వెంటపడ్డారు. ఈ ఘటనలో ఓ బీజేపీ కార్యకర్త తలకు గాయమైంది. పోలీసులు భారీగా మోహరించి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. తమ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు గాంధీభవన్ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేవైఎం కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిసరాల్లో కట్టిన ఫ్లెక్సీలను చించి నిరసన తెలిపారు. అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.
నాంపల్లిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఢిల్లీ బీజేపీ సీనియర్ నేత రమేశ్ బిదూరి చేసిన అనుచిత వ్యాఖ్యలు గొడవకు కారణమయ్యాయి. ఇవాళ ఉదయం కాంగ్రెస్ కార్యకర్తలు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లారు. అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు ఎదురు దాడి చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీసుపైకి రాళ్లు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ శ్రేణులు కర్రలతో కాంగ్రెస్ కార్యకర్తల వెంటపడ్డారు. ఈ ఘటనలో ఓ బీజేపీ కార్యకర్త తలకు గాయమైంది. పోలీసులు భారీగా మోహరించి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. తమ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు గాంధీభవన్ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేవైఎం కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిసరాల్లో కట్టిన ఫ్లెక్సీలను చించి నిరసన తెలిపారు. అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.

Also read:

