Twitter : మరో 50 మంది ట్విట్టర్‌‌‌‌ ఉద్యోగులు ఔట్‌‌‌‌‌‌‌‌

TWITTER

 

Twitter : ట్విట్టర్ మరో 50 మంది ఉద్యోగులను తీసేసింది. దీంతో ఎలన్ మస్క్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కంపెనీ ఏకంగా 70 శాతం మందిని తొలగించినట్టు అయ్యింది. కిందటేడాది నవంబర్‌‌‌‌‌‌‌‌లో సగం ఉద్యోగులను ట్విట్టర్ తొలగించిన విషయం తెలిసిందే. వివిధ ఇంజినీర్ల టీమ్‌‌‌‌ల ఉద్యోగులను తాజాగా కంపెనీ తొలగించింది. ప్రస్తుతం ట్విట్టర్ ఉద్యోగులు గ్లోబల్‌‌‌‌గా 2,000 మంది ఉన్నారు. మస్క్ వచ్చాక సుమారు 3,700 మందిని కంపెనీ తీసేసింది. ఆ తర్వాత వందల మంది రాజీనామా చేశారు. ఉద్యోగులను తొలగించమని హామీ ఇచ్చినప్పటికీ, మళ్లీ ఉద్యోగుల కోతను కంపెనీ మొదలు పెట్టింది. దేశంలో ట్విట్టర్ రెండు ఆఫీసులను మూసేసింది.