Rajesh Mishra : బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా అలియాస్ పప్పూ భార్ తౌల్ 51 ఏండ్ల వయసులో ఆయన 12వ తరగతి పరీక్ష రాశారు. ఈనెల 16న ఎగ్జామ్ జరిగింది. తమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తమతో కలిసి పరీక్ష రాయడంతో స్టూడెంట్లందరూ కాస్త థ్రిల్ అయ్యారు. పరీక్ష అనంతరం మీడియాతో మిశ్రా మాట్లాడారు. పెద్ద చదువులు చదవడానికి 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరుకావాలని ముందు నుంచి అనుకుంటున్నానని ఆయన తెలిపారు. ఇందు కోసం రాత్రి రోజూ 11 నుంచి 1 గంట వరకు ప్రిపేర్ అయ్యానని చెప్పారు. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ఉంటూనే లా కోర్సు పూర్తిచేసి, తన లక్ష్యం చేరుకుంటానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, మిశ్రా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బిత్రీ చైన్ పూర్ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీచేసి గెలుపొందారు. అయితే నిరుడు జరిగిన ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు.
Rajesh Mishra : 12వ తరగతి పరీక్ష రాసిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే
