CMR: గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో వీడియోలు తీశారని ఆందోళన

CMR

గర్ల్స్ హాస్టల్ లోని బాత్రూంలో మొబైల్ తో వీడియోలు తీశారని ఆరోపిస్తూ (CMR) విద్యార్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ మేడ్చల్ (CMR) సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఎంఆర్ గర్ల్స్ హాస్టల్లోని బాత్రూంలో మొబైల్ తో వీడియోలు తీసారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలిసే విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని నిరసన తెలుపుతున్నారు. వంట చేసే సిబ్బంది వీడియోలు తీశారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.

సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ లో బాత్రూంలో వీడియోను తీశారని వార్తతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. హాస్టల్ వద్దకు చేరుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని విద్యార్థులతో చెప్పారు. మరోవైపు బాత్రూం వెంటిలేటర్ వద్ద ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాలేజీ వద్ద ఆందోళన కొనసాగుతుంది.