గ్రూప్–1 పరీక్షలో (Group1Exam) చోటుచేసుకున్న అవకతవకలపై సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా ప్రభుత్వం మరోసారి అప్పీల్‌కు వెళ్లాలని భావించడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. సిద్దిపేటలో శనివారం నిర్వహించిన జాబ్ మేళా (Group1Exam) కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆటలాడుతోందని ఆరోపించారు.
గ్రూప్–1 పరీక్షల వ్యవహారంలో కోర్టు కూడా మొట్టికాయలేసిందని గుర్తుచేస్తూ, ఇంత నిర్లక్ష్యంగా పరీక్షలు నిర్వహించడం తగదన్నారు. అభ్యర్థులే మంత్రులు, అధికారులు లక్షల రూపాయలు లంచం అడిగారని చెప్పిన విషయాన్ని హరీశ్ రావు ప్రస్తావించారు. ఇలాంటి అనుమానాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే, నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి, అమలు చేయలేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ధ్వజమెత్తారు. నిరుద్యోగుల పక్షాన తాము నిరంతరం పోరాటం చేస్తామని, అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని బలంగా ప్రస్తావిస్తామని తెలిపారు.
ప్రియాంక గాంధీతో హుస్నాబాద్ సభలో నిరుద్యోగులకు రూ. 4వేల భృతి ఇస్తామని చెప్పించారని, అయితే నేటికీ ఆ వాగ్దానం అమలుకాలేదని ఆయన విమర్శించారు. అంతేకాదు, సిద్దిపేటలో ఏర్పాటు చేయాల్సిన ఐటీ టవర్‌పై కూడా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని హరీశ్ రావు ప్రస్తావించారు. వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు కల్పించే ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వేదం చేసిందని ఆయన మండిపడ్డారు.
హరీశ్ రావు వ్యాఖ్యలతో మరోసారి గ్రూప్–1 పరీక్షల వివాదం మరియు నిరుద్యోగుల సమస్యలు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. నిరుద్యోగుల ఆవేదనను విన్నపుడు ప్రభుత్వ వైఖరి మారకపోతే పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతాయని ఆయన హెచ్చరించారు.
Also read: