kerala: ఏనుగు దాడిలో ఏవీ ముఖేశ్ అనే వీడియో జర్నలిస్టు చనిపోయాడు. కేరళ (kerala) లోని పాలక్కాడ్ జిల్లా కొట్టెకాడ్లో ఈ ఘటన జరిగింది. దారితప్పిన ఏనుగులు గుంపు ఒకటి.. మలంబుజా, కొట్టెకాడ్లో మధ్య నదిని దాటుతుండగా ఆ దృశ్యాలను చిత్రీకరించేందుకు ఏవీ ముకేశ్ భావించాడు. అనంతరం కెమెరా సెట్ చేసుకుని వీడియో తీస్తుండగా.. ఓ ఏనుగు అతడి వైపు దూసుకొచ్చి దాడిచేసింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించిన లాభం లేకపోయింది. ఈ ఘటనలో రిపోర్టర్, డ్రైవర్ మాత్రం వాహనంలో అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఏవీ ముఖేశ్ మృతిపై సీఎం పినరయ్ విజయన్, ఇతర నేతలు సంతాంపం ప్రకటించారు.

Also read:

