Kukatpally: బ్యాట్ చోరీకి వెళ్లి చంపేసిండు

Kukatpally

కూకట్‌పల్లి (Kukatpally) బాలిక సహస్ర హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను బయటపెట్టారు. ఆధారాలన్నీ పక్కింటి బాలుడిపైనే చూపుతున్నాయని సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. దొంగతనం కోసం (Kukatpally) అతడు నెల రోజుల ముందే ప్రణాళిక రచించాడని తెలిపారు.

Image

సహస్రను హత్య చేయడానికి వాడిన కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 18న హత్య జరిగినప్పటికీ, మూడు రోజులపాటు సరైన క్లూ దొరకలేదని సీపీ చెప్పారు. అయితే నిన్న పోలీసులు బాలుడిని పట్టుకుని విచారించగా, అతడే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు.

Image

బాలిక తమ్ముడు క్రికెట్‌ బ్యాట్‌ ఇవ్వకపోవడంతో కోపం వచ్చిన నిందితుడు, దొంగతనానికి యోచించాడు. బ్యాట్‌ తీసుకుని వెళ్తున్న సమయంలో సహస్ర అతడిని చూసింది. వెంటనే ఆమె ‘దొంగ.. దొంగ’ అని అరిచింది. దీంతో నిందితుడు తెచ్చుకున్న కత్తితో సహస్రను పొడిచాడు.

పేరెంట్స్ ఆర్థికంగా బలహీనంగా ఉండటంతోనే క్రికెట్ బ్యాట్ కొనలేకపోయానని బాలుడు తెలిపాడు. దొంగతనానికి సంబంధించిన ప్రణాళికను ఒక నోట్‌లో కూడా రాసుకున్నాడు. అంతేకాక, అతడికి సోషల్‌ మీడియాలో క్రైమ్‌ సీన్లు చూడడం అలవాటు. వాటి ప్రభావంతో ఎలా తప్పించుకోవాలో నేర్చుకున్నాడు. అలాగే ఓటీటీలో క్రైమ్‌ సినిమాలు చూసి ప్రభావితమయ్యాడు.

నిందితుడిని పోలీసులు జువెనైల్‌ హోంకు తరలించారు. ఈ ఘటన వెనుక ప్రత్యేక ఉద్దేశాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. “పిల్లల ప్రవర్తన పట్ల తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి” అని సీపీ మహంతి సూచించారు.

Also read: