బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ టెక్ సంస్థలు భారీ స్థాయిలో తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్న(Layoffs) విషయం తెలిసిందే. వివిధ కారణాలతో ఈ సంస్థలు భారీగా లేఆఫ్స్ చేశాయి. తాజాగా తొషిబా కంపెనీ కూడా మరో 4వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అయింది. ఇక ఈ ఏడాది ప్రారంభం నుంచి మే నెల ముగింపు వరకు దాదాపు 89వేల ఉద్యోగులను టెక్ సంస్థలు తొలగించాయి. ఈ విషయం ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, టిక్‌టాక్, టెస్లా, ట్విట్టర్, తొషిబా, ఇండీడ్ తో పాటు ఇతర ప్రముఖ సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగాలను తొలగించుకుంటున్నాయని ఈ నివేదిక ద్వారా తెలిసింది. ఇకపోతే ఏప్రిల్ నెలతో పోలిస్తే.. మే నెలలో లేఆఫ్స్ (Layoffs) సంఖ్య తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. మే నెలలో 39 కంపెనీలు 9,742 మంది ఉద్యోగులను లేఆఫ్స్ చేస్తే.. ఏప్రిల్ లో 50 కంపెనీలు 21,473 లేఆఫ్స్ ప్రకటించినట్లు తెలిపింది. ఈ విషయం కాస్త ఊరటనిచ్చేదిగా చెప్పవచ్చు. ఇక మే నెలలో ఇండీడ్, టిక్ టాక్ తలా వెయ్యి మందిని తొలగించాయి. గూగుల్ కూడా 200మంది ఉద్యోగులను లేఆఫ్స్ చేసింది.
Also read:
- Counting center: కౌంటింగ్ సెంటర్ లోకి వెళ్లొద్దు
- Shubman Gill: నటి రిధిమా, క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ పెళ్లి

