Maoist: చల్లగరిగేకు చేరుకున్న శంకర్ రావు, రంజిత మృతదేహాలు

maoist

భూపాలపల్లి  : ఈనెల16న ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్ట్‌ అగ్రనేత సిరిపెల్లి సుధాకర్‌ అలియాస్​శంకర్‌రావు దంపతుల మృతదేహాలు సొంతూరుకు చేరాయి. మావోయిస్టు (Maoist) దంపతులు శంకర్ రావు , రంజిత మృతదేహాలు చిట్యాల మండలంలోని చల్లగరిగెకు చేరుకున్నాయి. వారిద్దరి అంత్యక్రియలను ఇవాళ మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు వారి బంధువులు తెలిపారు. కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో 29 మంది మావోయిస్టులు (Maoist) చనిపోయిన ఘటనలో శంకర్ రావు దంపతులు కూడా ఉన్నారు. చిన్నతనంలోనే మావోయిస్టు ఉద్యమానికి ఆకర్షితుడై అజ్ఞాతంలోకి సిరిపెల్లి సుధాకర్ @ శంకర్ రావు @​ మురళి వెళ్లాడు. రెండున్నర దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తూ డీవీసీఎం స్థాయికి ఎదిగాడు. ఉద్యమ సమయంలోనే రంజిత @ దాశేశ్వర్ @ సుమనతో వివాహం జరిగింది. చల్లగరిగెకు శంకర్ రావు దంపతుల డెడ్ బాడీస్​ చేరుకోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. శంకర్ రావు దంపతుల మృతదేహాలకు గ్రామస్తులు, ప్రజా సంఘాలు నివాళి అర్పించారు. కాగా, శంకర్‌రావుపై రూ.25 లక్ష రివార్డు ఉన్నది.

Also read: