స్టాక్ (Stock) మార్కెట్ ఇవాళ మళ్లీ ఫుల్ జోష్ చూపించింది. నిఫ్టీ 25,000 మార్క్‌ను అధిగమించగా, సెన్సెక్స్ 1,100 పాయింట్లకు పైగా పెరిగింది. ఈ పెరుగుదలతో ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా జీఎస్టీ స్లాబ్‌లలో రాబోయే మార్పులపై అంచనాలు (Stock) మార్కెట్‌కు పెద్ద ఊపును ఇచ్చాయి.
జీఎస్టీ మార్పులు – ఆటోమొబైల్ రంగానికి బంగారు అవకాశం
ప్రభుత్వం ప్రతిపాదించిన జీఎస్టీ మార్పులు ఆటోమొబైల్ రంగానికి గేమ్‌చేంజర్‌గా మారనున్నాయి. ప్రస్తుతం ఉన్న 28% జీఎస్టీని 18%కి తగ్గించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. దీని వల్ల చిన్న కార్లు, టూ-వీలర్లు మరింత చవకగా లభించే అవకాశం ఉంది. దీంతో ఈ రంగానికి చెందిన షేర్లు నేడు అమాంతం ఎగిశాయి.
-
హీరో మోటోకార్ప్ షేర్లు 8% పెరిగాయి.
-
మారుతి సుజుకి షేర్లు 6%, టీవీఎస్ మోటార్ 5% పెరిగాయి.
-
నిఫ్టీ ఆటో ఇండెక్స్ 4% లాభపడింది.
ఇతర రంగాల ప్రదర్శన
కేవలం ఆటోమొబైల్ షేర్లే కాకుండా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్ షేర్లు కూడా ఈ ర్యాలీలో దూసుకుపోయాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 1.67% పెరిగింది.
అయితే, ఐటీ మరియు ఫార్మా రంగాలు మాత్రం ఒత్తిడిలోనే కొనసాగాయి.
పెట్టుబడిదారులకు మంచి సంకేతాలు
మార్కెట్ నిపుణులు ఈ ర్యాలీ ఇక్కడితో ఆగదని, ఇంకా కొన్ని వారాలు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. జీఎస్టీ స్లాబ్‌లలో మార్పులు వినియోగదారులకు ఉత్పత్తులు చవకగా అందేలా చేస్తాయి. మరోవైపు కంపెనీల తయారీ ఖర్చులు తగ్గి, లాభదాయకత పెరుగుతుంది. ఇది పెట్టుబడిదారులకు మరింత బలమైన సంకేతం అవుతుంది.
ప్రస్తుతం ప్రభుత్వం 12% మరియు 28% జీఎస్టీ స్లాబ్‌లను రద్దు చేసి కేవలం 5% మరియు 18% స్లాబ్‌లు మాత్రమే ఉంచే ప్రతిపాదన చేస్తోంది. దీని వల్ల గృహోపకరణాలు, వాహనాలు వంటి అనేక ఉత్పత్తులు చవకబారే అవకాశం ఉంది.
స్టాక్ మార్కెట్‌పై ఈ నిర్ణయం పాజిటివ్ ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also read:

