TankBund: డీజేలు పెట్టొద్దు.. పటాకులు కాల్చొద్దు

నగరంలో గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా 25వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. ట్యాంక్ బండ్ (TankBund) వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదన్నారు. ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం 1.30 లోపు ఖైరతాబాద్ బడా గణేశ్ విగ్రహం నిమజ్జనం పూర్తవుతుందని చెప్పారు. నగర వ్యాప్తంగా అన్ని రకాల విగ్రహాలు కలిపి సుమారు లక్ష వరకు ఉండొచ్చన్నారు. 17న వేల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం కానున్నాయన్నారు. తిలకించేందుకు పెద్ద ఎత్తున నగరవాసులు హుస్సేన్‌సాగర్‌ (TankBund) పరిసరాలకు వస్తారని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని సీపీ వివరించారు. నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌లో గణేష్‌ నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

Image

నగరంలో గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా 25వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. ట్యాంక్ బండ్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదన్నారు. ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం 1.30 లోపు ఖైరతాబాద్ బడా గణేశ్ విగ్రహం నిమజ్జనం పూర్తవుతుందని చెప్పారు. నగర వ్యాప్తంగా అన్ని రకాల విగ్రహాలు కలిపి సుమారు లక్ష వరకు ఉండొచ్చన్నారు. 17న వేల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం కానున్నాయన్నారు. తిలకించేందుకు పెద్ద ఎత్తున నగరవాసులు హుస్సేన్‌సాగర్‌ పరిసరాలకు వస్తారని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని సీపీ వివరించారు. నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌లో గణేష్‌ నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.

 

సూచనలివి:

  •  డీజేలకు అనుమతి లేదు.. లౌడ్ స్పీకర్లు పెట్టొద్దు
  •  ఒక గణేశ్ విగ్రహానికి ఒక్క వాహనానికే అనుమతి
  •  రంగులు చల్లుకునేందుకు కాన్ఫెట్టి తుపాకులను ఉపయోగించొద్దు
  •  విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంలో మద్యం, మత్తుమందులు సేవించిన వ్యక్తులకు నో పర్మిషన్
  •  రోడ్డుపై వాహనం వెళ్లేటప్పుడు ట్రాఫిక్‌ను ప్రభావితం చేయకూడదు
  •  ఏదైనా ప్రార్థనా స్థలం దగ్గర లేదా మార్గంలో ఆపకూడదు
  •  పోలీసుల ఆదేశాల మేరకే వాహనాల కదలికలు ఆధారపడి ఉంటాయి
  •  ఆయుధాలు, మండే పదార్థాలు తీసుకెళ్లకూడదు
  •  ఎలాంటి రాజకీయ ప్రసంగాలు/రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దు
  •  ఊరేగింపు సమయంలో బాణాసంచా ఉపయోగించొద్దు
  •  జెండాలు లేదా అలంకారాల కోసం ఉపయోగించే కర్రలు 2 అడుగుల కన్నా ఎక్కువ పొడవు ఉండకూడదు.
  •  వెర్మిలియన్, కుంకుమ లేదా గులాల్‌లను బాటసారులపై వేయకూడదు
  •  ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే 100కి డయల్ చేసి సమాచారం ఇవ్వాలి

Image

 

Also read: