HMVP: వణికిస్తున్న చైనా వైరస్

HMVP

దేశంలోకి ప్రాణాంతకమైన (HMVP) హెచ్ఎంపీ వైరస్ ఎంటరైంది. కర్ణాటకలో రెండు, గుజరాత్ లో ఒక కేసు నమోదైంది. బాధితులంతా ఏడాది లోపు చిన్నారులే. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇద్దరు పసికందులకు (HMVP) హెఎంపీవీ(హ్యుమన్ మెటపోనియం వైరస్) సోకింది. దీంతో చైనాను వణికస్తున్న ఈ వైరస్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిందని ఐసీఎంఆర్ ధ్రువీకరించింది. కర్ణాటక ప్రభుత్వం సైతం ధ్రవీకరించింది. బెంగళూరులో మూడు నెలల ఆడ శిశువుకు వైరస్ సోకింది. 8 నెలల మగ శిశువుకు వైరస్ సోకింది. ఇద్దరికి ప్రస్తుతం ప్రత్యేక వార్డుల్లో చికిత్సలు అందిస్తున్నట్టు కర్ణాటక వైద్యశాఖ వెల్లడించింది. బెంగళూరు నార్త్ లో బ్రోంకోప్ న్యుమోనియా లక్షణాలతో బాప్టిస్ట్ హాస్పిటల్‌లో చేరిన ఓ మూడు నెలల వయస్సున్న ఓ ఆడ శిశువు కోలుకొని డిశ్చార్జి అయ్యింది. ఆ పాపకు సంబంధించిన శాంపిల్స్ ఐసీఎంఆర్ కు పంపిచగా హెచ్ఎంవీపీ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఈ నెల 3న బ్రోంకోప్ న్యుమోనియా లక్షణాలతో ఇబ్బందిపడుతున్న ఓ మగశిశువును ఇదే ఆస్పత్రికి తీసుకురాగా వైద్యులు పరీక్షలు నిర్వహించి హెచ్ఎంవీపీ ఉన్నట్టు నిర్ధారించారు. ప్రస్తుతం బాబు కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా గుజరాత్ లోని ఆహ్మదాబాద్ లో ఓ రెండు నెలల చిన్నారికి హెచ్ఎంపీ వైరస్ ఉన్నట్టు బయటపడింది.

Image

 

ఏమిటీ హెచ్ఎంపీవీ
హెచ్ఎంపీవీ అనేది శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన వైరస్. ఇది పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులను వేగంగా ప్రభావితం చేస్తుంది. దీని లక్షణాలు సాధారణంగా ఫ్లూ లాగా ఉంటాయి. ఈ వైరస్ సోకినవారిలో జ్వరం, గొంతు నొప్పి, దగ్గు ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. హెచ్ఎంవీపీ వైరస్ తీవ్రమైతే న్యుమోనియా, బ్రాంకైటిస్ వచ్చేందుకు అవకాశముంది. దీనిని వెంటనే గుర్తించపోతే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 14 ఏండ్ల లోపు పిల్లలకు తొందరగా సోకే అవకాశం ఉందంటున్నారు.

Image

మాస్క్ మస్ట్!
మళ్లీ కరోనా కాలం నాటి జాగ్రత్తలు పాటించాల్సిన సమయం వచ్చిందని వైద్యాధికారులు చెబుతున్నారు. కచ్చితంగా అందరూ మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. భౌతిక దూరం పాటించాలని, షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దని సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి, ముక్కుదిబ్బడ వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Image

Also read: