Tragic Incident: ఒకరిని కాపాడబోయి మరొకరు…

Tragic Incident

కుమ్రంభీమ్‌ జిల్లా వాంకిడి మండలం దాబా (Tragic Incident) గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వాగులో పడి ఒకరిని కాపాడే ప్రయత్నంలో తల్లి సహా ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గ్రామమంతా ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి (Tragic Incident) గురైంది.

గ్రామానికి చెందిన నీలాబాయి తన కూతురు, అలాగే మరో ఇద్దరు గ్రామ చిన్నారులతో కలిసి శనివారం మధ్యాహ్నం వాగు దగ్గర మందు బస్తాలను భూభ్రం చేస్తోంది. ఈ క్రమంలో పిల్లలు ప్రమాదవశాత్తు కాలుజారి వాగులో పడిపోయారు. వారిని గమనించిన నీలాబాయి వెంటనే వారిని కాపాడేందుకు వాగులోకి దూకింది. కానీ బలమైన ప్రవాహానికి ఆమె కూడా చిక్కుకుని బయటపడలేకపోయింది.

పిల్లలు, తల్లి నీటిలో కూరుకుపోయి ఆర్తనాదాలు చేస్తుండగా అక్కడికొచ్చిన గ్రామస్తులు రక్షించడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే నలుగురూ ప్రాణాలు కోల్పోయారు. గ్రామంలోని ఒకే సమయంలో ముగ్గురు చిన్నారులు, ఒక తల్లి మృతిచెందడం ఆ కుటుంబాలకే కాకుండా మొత్తం గ్రామానికీ తీరని లోటుగా మారింది.

ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనపై గ్రామస్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు. చిన్నారుల అమాయక ప్రాణాలు, వారిని కాపాడబోయిన తల్లి ప్రాణం ఇలా ఒక క్షణంలో నశించడం అందరినీ కలచివేసింది.

ఈ ఘటనపై స్థానికులు మాట్లాడుతూ – “గ్రామంలో వాగులు, చెరువుల దగ్గర భద్రతా చర్యలు అవసరం. ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడంలేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.

Also read: