వారణాసిలోని (Varanasi) యువతిపై జరిగిన అమానుష సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. 19 ఏళ్ల ఒక యువతిని 23 మంది కలిసి ఒక వారం పాటు సామూహికంగా అత్యాచారానికి పాల్పడినట్లు (Varanasi) పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
ఈ ఘటనలో, నిందితుల్లో కొంతమంది యువతి ప్రీవియస్ క్లాస్‌మేట్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అమేకు మత్తుపదార్థాలు ఇచ్చి, పలు హోటళ్లకు, హుక్కా బార్లకు తీసుకెళ్లారు. అక్కడే ఆమెపై పలు వ్యక్తులు అత్యాచారం చేసి వీడియోలు తీశారు. తర్వాత ఆ వీడియోలను వైరల్ చేస్తామంటూ బెదిరించి ఆమెను 6 రోజుల పాటు బంధించి ఉంచారు.
ఏప్రిల్ 4న బాధితురాలు తమ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని తీవ్రంగా మానసికంగా, శారీరకంగా వేధించిన ఈ దారుణ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి 9 మందిని అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల భద్రతపై ప్రభుత్వం మరింత ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితులపై కఠిన శిక్షలు విధించాలని ప్రజలు కోరుతున్నారు.
ఏప్రిల్ 4న బాధితురాలు తమ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని తీవ్రంగా మానసికంగా, శారీరకంగా వేధించిన ఈ దారుణ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి 9 మందిని అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల భద్రతపై ప్రభుత్వం మరింత ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితులపై కఠిన శిక్షలు విధించాలని ప్రజలు కోరుతున్నారు.
Also read:

