పాలు విరిగిపోయాయని భార్య పాణం పోయేలా ఓ భర్త తీవ్రంగా కొట్టాడు. మధురానగర్ ఎల్లారెడ్డి (Yellareddy) గూడలో అక్మల్ హుస్సేన్ తన భార్య హీనా బేగంతో కలిసి ఉంటున్నారు. (Yellareddy)ఇవాళ ఉదయం పొయ్యి మీద పెట్టిన పాలు విరిగాపోయాయని అక్మల్ హుస్సేన్ తన భార్యను ప్రాణం పోయేలా కొట్టి చిత్రహింసలు పెట్టాడు. అనంతరం హీనా చనిపోయిందంటూ ఆమె తల్లి దండ్రులకు ఫోన్ చేశాడు. ఆమె కుటుంబసభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని ఒళ్లంతా గాయాలతో కమిలిపోయి ఉన్న కుమార్తెను చూసి ఆవేదనకు గురై ఆస్పత్రిలో చేర్చారు. ఈ సందర్భంగా హీనా మాట్లాడుతూ తన భర్తతో పాటు అత్తింటి వారి నుంచి అదనపు కట్నం కోసం రోజూ చిత్రహింసలు అనుభవిస్తున్నాని చెప్పింది. మూడురోజుల పాటు గదిలో బంధించి పైశాచికంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:

