CM: కాళేశ్వరం రిపేరుకు 80 వేల పుస్తకాలు చదవాలె!

CM

తెలంగాణ ముఖ్యమంత్రి (CM) రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపేరుకు 80 వేల పుస్తకాలు చదవాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలలో మూడు రకాల లోపాలు ఉన్నాయని – డిజైనింగ్, ఇంజినీరింగ్, నిర్మాణ లోపాలున్నట్టు తేలిందని (CM) ఆయన వివరించారు.

ఈ రోజు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శ్రీపాద ఎల్లంపల్లి జలాశయాన్ని సందర్శించారు. గోదావరి మాతకు పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన, ఎల్లంపల్లి ప్రాజెక్టు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అత్యంత శాస్త్రీయంగా నిర్మించబడిందని అన్నారు. గోదావరి ప్రాజెక్టుల్లో ఎల్లంపల్లి జలాశయం ప్రాణవాయువులాంటిదని సీఎం పేర్కొన్నారు.

కాళేశ్వరం నీళ్లను ఆపితే ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ఉంచిన తర్వాత దానిపై పూర్తి వివరాలు చెబుతానని స్పష్టం చేశారు. ముఖ్యంగా మేడిగడ్డ విషయంలో సాంకేతిక కమిటీ ఇచ్చిన నివేదికను పట్టించుకోకుండా వదిలేశారని, అందుకే ఆ బ్యారేజీ పనికిరాకుండా పోయిందని ఆయన మండిపడ్డారు.

Image

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే

సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూజా కార్యక్రమాల అనంతరం ఆయన కామారెడ్డి, మెదక్ జిల్లాల్లోని వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రాష్ట్ర రాజకీయాల్లో, కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంది. భారీ అంచనాలతో నిర్మించబడిన ఈ ప్రాజెక్టు నిర్మాణ లోపాలు బయటపడటంతో ప్రజలలో అనుమానాలు పెరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ వేడెక్కే చర్చలకు దారి తీస్తున్నాయి.

Also read: