ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇవాళ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 10 జనపథ్ కు వెళ్లిన రేవంత్ రెడ్డి దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన అంశాలను రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వివరించారు. ముఖ్యంగా కులగణన, ఎస్సీ వర్గీకరణ తీర్మానాలకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో వీటికి సంబంధించి త్వరలోనే రెండు బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. గద్వాల్, సూర్యాపేటల్లో నిర్వహించ తలపెట్టిన సభల్లో ఏదో ఒకదానికి రావాలని రాహుల్ గాంధీని ఆహ్వానించారు. ఇక కులగణన సర్వే ఆధారంగా రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇవ్వడంపై రాహుల్ కు రేవంత్ రెడ్డి వివరించారు.
రాహుల్కులం తెలీదనడం సిగ్గుచేటు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కులం బీజేపీ నేతలు తెలీదనడం సిగ్గుచేటు అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ విమర్శించారు. అన్ని వర్గాల కోసం రాహుల్ చేస్తున్న పోరాటం వారికి నచ్చట్లేదని ఫైర్అయ్యారు. కాబోయే ప్రధాని రాహుల్ అని తెలిసి నెహ్రూ కుటుంబాన్ని బీజేపీ నేతలు కించపరుస్తున్నారని ఆగ్రహంవ్యక్తంచేశారు. కుల, మత రాజకీయాలు చేసే బీజేపీ భూస్థాపితం కాక తప్పదని వార్నింగ్ఇచ్చారు. రాహుల్ గాంధీ కులం పండిత్ (బ్రాహ్మణ కులం) అని పేర్కొన్నారు.
త్వరలో రేవంత్ సస్పెన్షన్
కాంగ్రెస్ లో రోజురోజుకూ ముసలం ముదురుతోందని, త్వరలో రేవంత్ రెడ్డిని ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘నేను చెప్పింది ఎన్నడూ తప్పు కాలేదు. రేవంత్ పై 25 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. మున్షీని ఆయన మేనేజ్ చేస్తున్నారనే అధిష్ఠానం ఇన్చార్జిని మార్చింది. ఆ పార్టీ హైకమాండ్ పెద్దలు రాష్ట్రంలోని అన్ని పరిణామాలను సైలెంట్‌గా గమనిస్తున్నరు. త్వరలో తనను కూడా పీకేస్తారనే భయంతోనే రేవంత్ ఢిల్లీ వెళ్లి రాహుల్ కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నరు’ అంటూ సెటైర్వేశారు.
Also read:

