Adani: హైకమాండ్ కు చిత్తశుద్ధి ఉంటె

Adani

అదాని (Adani) అవినీతిపరుడైతే .. రేవంత్ రెడ్డి నీతిపరుడు ఎలా అవుతాడో రాహుల్ గాంధీ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ సర్కార్ అదానితో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయించాలని అన్నారు. తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ.. అదాని (Adani) విషయంలో కాంగ్రెస్ ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా మాట్లాడుతోందని ఆరోపించారు.

కెన్యా లాంటి చిన్న దేశాలే కాంట్రాక్ట్ లు రద్దు చేసుకున్నప్పుడు.. రేవంత్ ఎందుకు రద్దుచేసుకోడని ప్రశ్నించారు. మహారాష్ట్ర వెళ్లి అదానిని గజదొంగ అన్న రేవంత్.. తెలంగాణలో ఎలా దోస్తీ చేస్తాడని అన్నారు. అదానితో ప్రభుత్వ ఒప్పందాలపై బీజేపీ వైఖరి ఎంటో చెప్పాలన్నారు. అదాని వ్యవహారంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని మరోసారి రుజువైందని వెల్లడించారు. అదానితో దేశానికి నష్టమొస్తే తెలంగాణకు నష్టం రాదా? అదానితో రేవంత్ చేసుకున్న రూ. 12,400 కోట్ల ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు.

బడేభాయ్ మోదీ ఆదేశాలను చోటా భాయ్ రేవంత్ అమలు చేశాడని ఆరోపించారు. తెలంగాణలో అదాని వ్యాపార సామ్రాజ్యం ఏర్పాటుకు రేవంత్ సహకారం అందిస్తున్నాడని తెలిపారు. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ వద్దని ఆందోళన చేసినా రేవంత్ పట్టించుకోలేదని అన్నారు. అదాని వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని పేర్కొన్నారు.

అదానితో ప్రభుత్వ ఒప్పందాలపై బీజేపీ వైఖరి ఎంటో చెప్పాలన్నారు. అదాని వ్యవహారంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని మరోసారి రుజువైందని వెల్లడించారు. అదానితో దేశానికి నష్టమొస్తే తెలంగాణకు నష్టం రాదా? అదానితో రేవంత్ చేసుకున్న రూ. 12,400 కోట్ల ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. బడేభాయ్ మోదీ ఆదేశాలను చోటా భాయ్ రేవంత్ అమలు చేశాడని ఆరోపించారు. తెలంగాణలో అదాని వ్యాపార సామ్రాజ్యం ఏర్పాటుకు రేవంత్ సహకారం అందిస్తున్నాడని తెలిపారు.

Adani Under Fire: US Alleges Multibillion-Dollar Bribery And Fraud Plot -  BW BusinessWorld

రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ వద్దని ఆందోళన చేసినా రేవంత్ పట్టించుకోలేదని అన్నారు. అదాని వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని పేర్కొన్నారు.

Also  read: