(Jharkhand) జార్ఖండ్, మహారాష్ట్రలో మైకులు మూగబోయాయి. మహారాష్ట్రలో 288 స్థానాలకు ఒకే విడుతలో ఈ నెల 20 ఎన్నికలు జరగనున్నాయి. ఇందు కోసం తెలంగాణ, ఏపీ నుంచి కాంగ్రెస్, బీజేపీ, జనసేన నాయకులు వెళ్లి ప్రచారం చేశారు. అదే విధంగా (Jharkhand) జార్ఖండ్ లో రెండో దశ ఎన్నికల ప్రచారం కూడా ఇవాళ్టితో ముగిసింది. మొత్తం 38 స్థానాలకు ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కొత్త నినాదాలతో ఇండియా, ఎన్డీయే కూటమి పార్టీలు తమ ప్రయత్నాలన్నీ చేశారు. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో 234 జనరల్, 25 ఎస్టీ, 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి.
జార్ఖండ్, మహారాష్ట్రలో మైకులు మూగబోయాయి. మహారాష్ట్రలో 288 స్థానాలకు ఒకే విడుతలో ఈ నెల 20 ఎన్నికలు జరగనున్నాయి. ఇందు కోసం తెలంగాణ, ఏపీ నుంచి కాంగ్రెస్, బీజేపీ, జనసేన నాయకులు వెళ్లి ప్రచారం చేశారు. అదే విధంగా జార్ఖండ్ లో రెండో దశ ఎన్నికల ప్రచారం కూడా ఇవాళ్టితో ముగిసింది. మొత్తం 38 స్థానాలకు ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కొత్త నినాదాలతో ఇండియా, ఎన్డీయే కూటమి పార్టీలు తమ ప్రయత్నాలన్నీ చేశారు. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో 234 జనరల్, 25 ఎస్టీ, 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 9.63 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వారిలో 4.97 కోట్ల మంది పురుషులు, 4.66 కోట్ల మంది మహిళ ఓటర్లు ఉన్నారు. ఇక, 1.85 కోట్ల మంది యువ ఓటర్లు ఈ సారి డిసైడింగ్ ఫ్యాక్టర్ గా నిలవబోతున్నారు. వారిలో 20.93 లక్షల మంది తొలిసారి ఓటు వేస్తున్నారు. మహాయుతి, ఎంవీఏ కూటములు తమ మేనిఫెస్టోల్లో ప్రధానంగా యువత, మహిళ ఓట్ల కోసం ఎక్కువ హామీలను ప్రకటించాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలుసభల్లో పాల్గొని ఆరు గ్యారెంటీలు సక్సెస్ ఫుల్ గా అమలు చేస్తున్నామని చెప్పారు. అలాగే మంత్రులు కూడా ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. జార్ఖండ్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రచారం చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ మహాయుతి తరఫున క్యాంపెయిన్ నిర్వహించారు. ఓటరు ఎవరి వైపు మొగ్గ చూపుతాడనేది ఈ నెల 20న నిర్ధారణ కానుంది.
Also read: