Ponguleti: మాది చేతల ప్రభుత్వం

Ponguleti

తమది చేతల ప్రభుత్వమని మంత్రి (Ponguleti) పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ విద్యను అందించాలనే సంకల్పంతోనే రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు (Ponguleti) . ఇవాళ ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిందని చెప్పారు. మాటల్లో తప్ప చేతల్లో ఎక్కడా చిత్తశుద్ధితో పనిచేయలేదని అన్నారు. స్కూళ్ళు పెట్టిందే తప్ప వసతులు కల్పించడం లో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించబోతున్నామని చెప్పారు. ఇవాళ ఒక్క రోజే 28 స్కూళ్లకు భూమి పూజ జరుగుతోందని మంత్రి వెల్లడించారు. విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లకు తమ ప్రభుత్వం అధిక ప్రాదాన్యం ఇస్తుందని చెప్పారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, గ్రామీణులకు మెరుగైన విద్య అందాలనే ఉద్దేశంతోనే ఇటీవల 10 వేల ఆరుగురు ఉపాధ్యాయులను డీఎస్సీ ద్వారా నియమించామని వివరించారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి వస్తుందని వివరించారు.

తమది చేతల ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ విద్యను అందించాలనే సంకల్పంతోనే రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇవాళ ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిందని చెప్పారు. మాటల్లో తప్ప చేతల్లో ఎక్కడా చిత్తశుద్ధితో పనిచేయలేదని అన్నారు. స్కూళ్ళు పెట్టిందే తప్ప వసతులు కల్పించడం లో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించబోతున్నామని చెప్పారు. ఇవాళ ఒక్క రోజే 28 స్కూళ్లకు భూమి పూజ జరుగుతోందని మంత్రి వెల్లడించారు. విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లకు తమ ప్రభుత్వం అధిక ప్రాదాన్యం ఇస్తుందని చెప్పారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, గ్రామీణులకు మెరుగైన విద్య అందాలనే ఉద్దేశంతోనే ఇటీవల 10 వేల ఆరుగురు ఉపాధ్యాయులను డీఎస్సీ ద్వారా నియమించామని వివరించారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి వస్తుందని వివరించారు.

Also read: