PM Modi: జైలు శిక్ష అనుభవించిన పీఎం, సీఎం దిగిపోవద్దా?

PM Modi

ప్రజాప్రతినిధులపై ప్రశ్న

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గయాజీలో బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పారు – “యాభై గంటల పాటు జైల్లో ఉన్న ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోతాడు. అయితే జైలు శిక్ష అనుభవించిన ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి ఎందుకు పదవిలో కొనసాగాలి?” (PM Modi) అని.

విపక్షాలపై విమర్శ

తప్పు చేస్తే సీఎం, ప్రధానిని కూడా తొలగించేలా బిల్లు ప్రవేశపెట్టామని మోదీ వివరించారు. ఆ బిల్లుకు విపక్షాలు వ్యతిరేకిస్తుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు జైల్లో లేకపోతే బెయిల్ మీద ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

అవినీతి ఉదాహరణలు

కొంతమంది నేతలు జైళ్లలో ఉండగానే ఫైళ్లపై సంతకాలు చేయడం, ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడం చూశామని మోదీ గుర్తు చేశారు. అవినీతిపరులే పాలన చేస్తే దేశం నుంచి అవినీతి ఎలా పోతుందన్నారు.

ఎన్డీఏ కట్టుదిట్టం

అవినీతికి వ్యతిరేకంగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువస్తున్న చట్టానికి ఎవరూ మినహాయింపు కాదని మోదీ స్పష్టం చేశారు. “ప్రధాని కూడా ఆ చట్టం పరిధిలోకి వస్తారు” అని ఆయన హామీ ఇచ్చారు.

Also read: