T20: ఒమన్ పై ఆస్ట్రేలియా గెలుపు

టీ20 (T20) వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆస్ట్రేలియా తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. ఒమ‌న్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 39 ర‌న్స్ తేడాతో విజ‌యం సాధించింది. కెన్సింగ్టన్ ఓవ‌ర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జ‌రిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 5 వికెట్ల న‌ష్టానికి 164 ర‌న్స్ చేసింది. (T20) బ్యాట‌ర్ మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచ‌రీలతో చెల‌రేగారు. స్టోయినిస్ 67 ర‌న్స్, డేవిడ్ వార్నర్ 56 ర‌న్స్ చేశారు. ఇక భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఒమ‌న్‌.. 9 వికెట్లు కోల్పోయి కేవలం 125 ర‌న్స్ చేసింది. స్టోయినిస్ మూడు వికెట్లు తీసుకోగా, జంపా, ఎలిస్‌, స్టార్క్‌లు చెరి రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ విక్టరీతో గ్రూపు బిలో ఆస్ట్రేలియా రెండు పాయింట్లు, నెట్‌ర‌న్‌రేట్‌తో టాప్‌లో ఉంది.

Also read: