Warner: ఫ్రమ్‌ బౌండరీ టు బాక్సాఫీస్‌

Warner

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన మూవీ ‘రాబిన్ హుడ్. యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్. ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఈ సినిమాలో ఆస్ట్రేలియన్ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్ వార్నర్ (Warner) కూడా నటించిన సంగతి తెలిసిందే. ప్రమోషన్స్​లో భాగంగా మైత్రీ మూవీ టీమ్‌ ఈ సినిమాలోని వార్నర్‌ లుక్‌ను రిలీజ్‌ చేసింది. తాజాగా వార్నర్‌ ఫొటో షేర్‌ చేసి అతడికి ఇండస్ట్రీలోకి గ్రాండ్​వెల్​కమ్​చెప్పింది. ‘ఫ్రమ్‌ బౌండరీ టు బాక్సాఫీస్‌’ అంటూ ట్యాగ్​లైన్ పోస్టర్​యాడ్​చేసింది. స్టైలిష్ ఆరెంజ్ జంప్‌సూట్ ధరించి కిందికి చూస్తూ, ఫోకస్‌లో కనిపిస్తున్న (Warner) వార్నర్ స్టన్ అయ్యేలా చేశాడు. ప్రస్తుతం ఆ లుక్‌ అటు క్రికెట్‌ ఫ్యాన్స్​ను, ఇటు సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే చిత్రంలో అతని రోల్ చిన్నదా, లేక ప్రాధాన్యత ఉన్న క్యారెక్టరా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమా ప్రచారంలోనూ వార్నర్‌ పాల్గొంటారని ఇటీవల వెంకీ కుడుముల వెల్లడించారు. కాగా.. పలువురు తెలుగు సినిమా హీరోల స్టైల్‌ను అనుకరిస్తూ డేవిడ్‌ వార్నర్‌ చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి. ‘బాహుబలి’, ‘పుష్ప’, ‘డీజే టిల్లు’ లాంటి ఫేమస్‌ క్యారెక్టర్లలో ఆయన ఫన్నీ వీడియోలు చేసి సినీ ప్రియులకు కూడా చేరువయ్యారు.

Image

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన మూవీ ‘రాబిన్ హుడ్. యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్. ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఈ సినిమాలో ఆస్ట్రేలియన్ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్ వార్నర్ కూడా నటించిన సంగతి తెలిసిందే. ప్రమోషన్స్​లో భాగంగా మైత్రీ మూవీ టీమ్‌ ఈ సినిమాలోని వార్నర్‌ లుక్‌ను రిలీజ్‌ చేసింది. తాజాగా వార్నర్‌ ఫొటో షేర్‌ చేసి అతడికి ఇండస్ట్రీలోకి గ్రాండ్​వెల్​కమ్​చెప్పింది. ‘ఫ్రమ్‌ బౌండరీ టు బాక్సాఫీస్‌’ అంటూ ట్యాగ్​లైన్ పోస్టర్​యాడ్​చేసింది. స్టైలిష్ ఆరెంజ్ జంప్‌సూట్ ధరించి కిందికి చూస్తూ, ఫోకస్‌లో కనిపిస్తున్న వార్నర్ స్టన్ అయ్యేలా చేశాడు. ప్రస్తుతం ఆ లుక్‌ అటు క్రికెట్‌ ఫ్యాన్స్​ను, ఇటు సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే చిత్రంలో అతని రోల్ చిన్నదా, లేక ప్రాధాన్యత ఉన్న క్యారెక్టరా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమా ప్రచారంలోనూ వార్నర్‌ పాల్గొంటారని ఇటీవల వెంకీ కుడుముల వెల్లడించారు. కాగా.. పలువురు తెలుగు సినిమా హీరోల స్టైల్‌ను అనుకరిస్తూ డేవిడ్‌ వార్నర్‌ చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి. ‘బాహుబలి’, ‘పుష్ప’, ‘డీజే టిల్లు’ లాంటి ఫేమస్‌ క్యారెక్టర్లలో ఆయన ఫన్నీ వీడియోలు చేసి సినీ ప్రియులకు కూడా చేరువయ్యారు.

Image

Also read: