రాష్ట్ర రాజధానిలో 208 మంది పాకిస్తాన్( Pakistan) పౌరులున్నట్టు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. పహెల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దాయాది దేశంపై భారత్ అనేక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్(Pakistan) వాసులకు జారీ చేసిన వీసాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి పాకిస్తాన్ వారి వీసాలన్నీ రద్దు అయినట్లేనని విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రకటించింది. 
పాక్ జాతీయులకు జారీ చేసిన మెడికల్ వీసాలు మాత్రం ఏప్రిల్ 29వ తేదీ వరకు చెల్లుబాటు అవుతాయని కేంద్రం తెలిపింది. వీసాల గడువు ముగిసేలోగా భారత్‌లో ఉన్న పాక్ పౌరులంతా దేశాన్ని వీడాలని ప్రభుత్వం ఆదేశించింది.

దీంతో హైదరాబాద్ లో ఎంత మంది పాకిస్తానీలు ఉన్నారనే చర్చ తెరపైకి వచ్చింది. హైదరాబాద్ లో మొత్తం 208 మంది పాకిస్తానీలు ఉంటున్నట్లు ఎస్పీ అధికారులు గుర్తించారు. వీరిలో 156 మందికి లాంగ్ టర్మ్, 13మందికి షార్ట్ టర్మ్, 39 మందికి బిజినెస్ వీసాలు ఉన్నట్లు తేలింది.
Also read :
Hyderabad: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి గెలుపు
Medha Patkar: మేధాపాట్కర్ అరెస్ట్

