Aadhi srinivas: గుట్టలకు రైతుబంధు ఇవ్వం

Aadhi srinivas

కాంగ్రెస్​ప్రభుత్వంపై బురదజల్లడమే హరీశ్ రావు పనిగా పెట్టుకున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadhi srinivas) ఆరోపించారు. తెలంగాణలో 69 లక్షల మంది రైతులకు 7 వేల కోట్లకు పైగా నగదును వారి ఖాతాలో జమ చేశామని తెలిపారు. ఈ విషయం ఆయన తెలియదా? అని ప్రశ్నించారు. సీఎల్పీ ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్ లో ఆది శ్రీనివాస్​మాట్లాడుతూ ‘గత బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడు జూన్ 25కు ముందు రైతుబంధు రైతుల ఖాతాలో పడలేదు. హరీశ్ మాత్రం.. రైతు బంధు ఇవ్వడం లేదని మాట్లాడుతున్నరు. గత ప్రభుత్వంలో కొండలు, గుట్టలు, రోడ్లకు రైతు బంధు ఇచ్చారు. మా ప్రభుత్వం మాత్రం నిజమైన రైతుకు, వ్యవసాయ భూమికి మాత్రమే రైతు బంధు ఇస్తాం. హరీశ్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండూ.. ఆగస్టులో రైతు రుణమాఫీ చేయబోతున్నం. గతంలో కంటే ఎక్కువగా కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొన్నది. కేవలం మూడు రోజుల్లోనే రైతులకు ఆ డబ్బులు వేశాం. ప్రజలు మా పాలనను మెచ్చి గతం కంటే ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వేశారు. హరీశ్ రావు, కేటీఆర్.. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోవడానికి గల కారణాలపై విశ్లేషణ చేసుకుంటే మంచిది. మా ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఎన్నికల కోడ్ కారణంగా కొంత ఆలస్యం అయ్యింది. వచ్చే ఎడాది నుంచి వర్షాకాలం ముందుగానే రైతు భరోసా ఇస్తాం’ అని తెలిపారు.

Also read: