వెయ్యి కోట్ల బకాయిలు
తన్హా తెలంగాణ (Aarogyasri) ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్) ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రకటించింది. ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు (Aarogyasri) చెల్లించడం లేదని తెలిపింది.
ఆసుపత్రుల సమస్యలు
ఆసుపత్రుల నిర్వహణ కష్టతరమైందని తన్హా పేర్కొంది. ఆగస్టు 31లోగా బిల్లులు చెల్లించకపోతే సేవలు ఆగిపోతాయని హెచ్చరించింది.
ప్రభుత్వం నిర్లక్ష్యం
ప్రభుత్వం జనవరిలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించింది. ఈ కారణంగా సేవలు నిలిపివేయాలన్న నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
అధికారులకు నోటీసు
ఇప్పటికే ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్‌కుమార్‌కి నోటీసు పంపినట్టు తన్హా అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేశ్ వెల్లడించారు.
ఇతర పథకాలు కూడా ప్రభావితం
ఆరోగ్యశ్రీతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS), జర్నలిస్టుల ఆరోగ్య పథకం (JHS) కింద అందిస్తున్న సేవలకు కూడా ప్రభుత్వం చెల్లింపులు చేయలేదని తెలిపారు.
Also read: