ACB: ఏసీబీ దూకుడు

ACB

ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ డిస్మస్ కావడంతో ఏసీబీ (ACB) దూకుడు పెంచింది. ఈ కేసులో ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి నివాసాల్లో తనిఖీలు చేపట్టింది. ఇవాళ సాయంత్రం కేటీఆర్ నివాసంలో సోదాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ కేసులో లబ్ధిపొందినట్టు గా ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రీన్ కో ఆఫీసుల్లో ఇవాళ ఉదయం నుంచి సోదాలు మొదలయ్యాయి. మాదాపూర్ లోని ఆ సంస్థ కార్యాలయంలో (ACB) ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టారు. గ్రీన్‌కో అనుబంధ సంస్థ ‘ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌’లోనూ తనిఖీలు చేపట్టారు. ఏపీలోని మచిలీపట్నం గ్రీన్‌కో ఎనర్జీ కార్యాలయంలోనూ తెలంగాణ ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో గ్రీన్‌కో అనుబంధ సంస్థల ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఫార్ములా-ఈ ఒప్పందానికి ముందు ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ కు రూ.41 కోట్లు ఇవ్వడంపై అవినీతి నిరోధకశాఖ దృష్టి సారించింది. 2022 అక్టోబరు 25న రేసు నిర్వహణకు సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం జరగగా.. అంతకుముందు అదే ఏడాది ఏప్రిల్‌లో రూ.31 కోట్లు, అక్టోబరులో రూ.10 కోట్లు గ్రీన్‌కో అనుబంధ సంస్థలు ఎలక్టోరల్‌ బాండ్లను సమకూర్చడంపై ఏసీబీ ఆరా తీస్తోంది.

ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ డిస్మస్ కావడంతో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి నివాసాల్లో తనిఖీలు చేపట్టింది. ఇవాళ సాయంత్రం కేటీఆర్ నివాసంలో సోదాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ కేసులో లబ్ధిపొందినట్టు గా ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రీన్ కో ఆఫీసుల్లో ఇవాళ ఉదయం నుంచి సోదాలు మొదలయ్యాయి. మాదాపూర్ లోని ఆ సంస్థ కార్యాలయంలో ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టారు. గ్రీన్‌కో అనుబంధ సంస్థ ‘ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌’లోనూ తనిఖీలు చేపట్టారు. ఏపీలోని మచిలీపట్నం గ్రీన్‌కో ఎనర్జీ కార్యాలయంలోనూ తెలంగాణ ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో గ్రీన్‌కో అనుబంధ సంస్థల ఎలక్టోరల్‌ బాండ్ల వ్యవహారం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఫార్ములా-ఈ ఒప్పందానికి ముందు ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ కు రూ.41 కోట్లు ఇవ్వడంపై అవినీతి నిరోధకశాఖ దృష్టి సారించింది. 2022 అక్టోబరు 25న రేసు నిర్వహణకు సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం జరగగా.. అంతకుముందు అదే ఏడాది ఏప్రిల్‌లో రూ.31 కోట్లు, అక్టోబరులో రూ.10 కోట్లు గ్రీన్‌కో అనుబంధ సంస్థలు ఎలక్టోరల్‌ బాండ్లను సమకూర్చడంపై ఏసీబీ ఆరా తీస్తోంది.

Also read: