అదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని పాలమూరు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే (DK) అరుణ అన్నారు. ఇవాళ మహబూబ్‌నగర్‌లోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అధికారంతో విర్రవీగితే కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుందని హెచ్చరించారు. రేవంత్ స్థాయి మరిచి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల వేళ హామీలను సీఎం ఎక్కడా ప్రస్తావించడం లేదన్నారు. ఓట్ల కోసం మళ్లీ కొత్త కొత్త మాటలతో ప్రజల వద్దకు వస్తున్నారన్నారు. రేవంత్ వచ్చినప్పుడల్లా తనను అవమానించేలా మాట్లాడుతున్నారన్నారు.తనను చూస్తే ఆయనకు ఎందుకు కడుపు మంట అని (DK) ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఏం చేస్తారో చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. డీపీఆర్ సిద్ధం చేసి అనుమతులిస్తే కేంద్రం నుంచి పాలమూరు,-రంగారెడ్డి ప్రాజెక్టకు నిధులు తీసుకొస్తానని చెప్పారు. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ప్రాజెక్టుపై సమీక్ష జరపలేదని ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు ఇచ్చిన మెగా డీఎస్సీ హామీ ఏమైంది? టెట్, డీఎస్సీ రుసుములు ఎందుకు పెంచారని ఆమె ప్రశ్నించారు.
Also read:

