రాష్ట్రంలో ముగ్గురు సీనియర్ మంత్రులు కమీషన్ల దందా చేస్తున్నారని (bandi) బండి సంజయ్ ఆరోపించారు. వాళ్ల రిపోర్టు తయారు చేస్తున్నామని, త్వరలోనే బయటపెడ్తామని చెప్పారు. కమీషన్లు ఇస్తేనే కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేస్తున్నారన్నారు. ఆయన పైసలను ఢిల్లీలో కప్పం కట్టి పదవులను కాపాడుకుంటున్నారని (bandi) ఆరోపించారు. వాళ్లు కమీషన్ల మీదే బతుకుతున్నారని అన్నారు. కాంగ్రెస్ లో ఇద్దరు ముగ్గురు నిజాయితీ పరులైన మంత్రులున్నారని, వారికి అవినీతి మంత్రులకు పడటం లేదని అన్నారు. పర్సెంటేజీల విషయంలో అంతర్యుద్ధం మొదలైందని, అది ఎప్పుడైనా.. ఏమైనా జరగొచ్చని అన్నారు. తాజా మాజీ సర్పంచులను కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేశాయని విమర్శించారు.
50 శాతం కాంగ్రెస్ మంత్రులకు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ ఉందన్నారు. నెహ్రూ, ఇందిరకు భారత రత్న ఇచ్చిన కాంగ్రెస్ అంబేద్కర్ కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పార్లమెంటు సెంట్రల్ హాల్ లో బాబా సాహెబ్ ఫొటోను ఎందుకు పెట్టలేదన్నారు. హైదరాబాద్ లో నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం ఉంటే సీఎం ఎందుకు దండ వేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ మన్మోహన్ కు దక్కకుండా సోనియాను దేవతను చేశారని విమర్శించారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు మోడీ కాబట్టే ఢిల్లీలో చేశారని, కాంగ్రెస్ ఉంటే వేరే చోట చేసేవారని అన్నారు. పీవీలాగే మన్మోహన్ సింగ్ కు అవమానం జరిగేదన్నారు. మన్మోహన్ బతికి ఉన్నప్పుడు భారతరత్న కోసం ఎందుకు డిమాండ్ చేయలేదన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు మాజీ సర్పంచులంతా జెండాలు పక్కన పెట్టి బయటకు రావాలని అన్నారు. సర్పంచులకు అండగా ఉండేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని అన్నారు.
రాష్ట్రంలో ముగ్గురు సీనియర్ మంత్రులు కమీషన్ల దందా చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. వాళ్ల రిపోర్టు తయారు చేస్తున్నామని, త్వరలోనే బయటపెడ్తామని చెప్పారు. కమీషన్లు ఇస్తేనే కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేస్తున్నారన్నారు. ఆయన పైసలను ఢిల్లీలో కప్పం కట్టి పదవులను కాపాడుకుంటున్నారని ఆరోపించారు. వాళ్లు కమీషన్ల మీదే బతుకుతున్నారని అన్నారు. కాంగ్రెస్ లో ఇద్దరు ముగ్గురు నిజాయితీ పరులైన మంత్రులున్నారని, వారికి అవినీతి మంత్రులకు పడటం లేదని అన్నారు. పర్సెంటేజీల విషయంలో అంతర్యుద్ధం మొదలైందని, అది ఎప్పుడైనా.. ఏమైనా జరగొచ్చని అన్నారు. తాజా మాజీ సర్పంచులను కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేశాయని విమర్శించారు. 50 శాతం కాంగ్రెస్ మంత్రులకు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ ఉందన్నారు. నెహ్రూ, ఇందిరకు భారత రత్న ఇచ్చిన కాంగ్రెస్ అంబేద్కర్ కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పార్లమెంటు సెంట్రల్ హాల్ లో బాబా సాహెబ్ ఫొటోను ఎందుకు పెట్టలేదన్నారు. హైదరాబాద్ లో నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం ఉంటే సీఎం ఎందుకు దండ వేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ మన్మోహన్ కు దక్కకుండా సోనియాను దేవతను చేశారని విమర్శించారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు మోడీ కాబట్టే ఢిల్లీలో చేశారని, కాంగ్రెస్ ఉంటే వేరే చోట చేసేవారని అన్నారు. పీవీలాగే మన్మోహన్ సింగ్ కు అవమానం జరిగేదన్నారు. మన్మోహన్ బతికి ఉన్నప్పుడు భారతరత్న కోసం ఎందుకు డిమాండ్ చేయలేదన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు మాజీ సర్పంచులంతా జెండాలు పక్కన పెట్టి బయటకు రావాలని అన్నారు. సర్పంచులకు అండగా ఉండేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని అన్నారు.
Also read:

