Bandi: కేటీఆర్.. 7 రోజుల్లో సారీ చెప్పు

bandi

మాజీ మంత్రి కేటీఆర్​ జారీ చేసిన లీగల్‌ నోటీసులకు కేంద్ర మంత్రి (Bandi) బండి సంజయ్‌ రిప్లై ఇచ్చారు. ఆయన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని, నిరాధారమైనవి అంటూ కేటీఆర్​కు కౌంటర్‌ నోటీసులు ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడా తప్పులేదని స్పష్టంచేశారు. (Bandi) పొలిటికల్‌ విమర్శలపై నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ లీగల్ నోటీసులకు తాను భయపడేది లేదని తెలిపారు. ‘కేటీఆర్​పంపిన లీగల్​నోటీసులు విత్​డ్రా చేసుకోవాలి. నాపై ఆయన చేసిన విమర్శలకు సమాధానం చెప్పాను. వ్యక్తిగతంగా ఎవర్నీ దూషించాలనేది నా ఉద్దేశం కాదు. తక్షణమే నాపై ఆరోపణలు వెనక్కి తీసుకుని 7 రోజుల్లో కేటీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదంటే నేను లీగల్​గా ముందుకు వెళ్తా’ అని నోటీసుల్లో పేర్కొన్నారు.

Image

మాజీ మంత్రి కేటీఆర్​జారీ చేసిన లీగల్‌ నోటీసులకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ రిప్లై ఇచ్చారు. ఆయన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని, నిరాధారమైనవి అంటూ కేటీఆర్​కు కౌంటర్‌ నోటీసులు ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడా తప్పులేదని స్పష్టంచేశారు. పొలిటికల్‌ విమర్శలపై నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ లీగల్ నోటీసులకు తాను భయపడేది లేదని తెలిపారు. ‘కేటీఆర్​పంపిన లీగల్​నోటీసులు విత్​డ్రా చేసుకోవాలి. నాపై ఆయన చేసిన విమర్శలకు సమాధానం చెప్పాను. వ్యక్తిగతంగా ఎవర్నీ దూషించాలనేది నా ఉద్దేశం కాదు. తక్షణమే నాపై ఆరోపణలు వెనక్కి తీసుకుని 7 రోజుల్లో కేటీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదంటే నేను లీగల్​గా ముందుకు వెళ్తా’ అని నోటీసుల్లో పేర్కొన్నారు.

పగలు, శత్రుత్వాలు పక్కనబెట్టాలి (బాక్స్)
అమరావతి: రాజకీయ పార్టీలు పగలు, పట్టింపులు, శత్రుత్వాలు పక్కనబెట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్​ అన్నారు. విశాఖపట్నంలోని వీఎంఆర్డీఏలో నిర్వహించిన రోజ్​గార్​మేళా ఆయన మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి అన్ని పార్టీలు సహకరించాలని సూచించారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని, అన్ని రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్రం పనిచేస్తోందని తెలిపారు.

Also read: