మూసీ పునరుజ్జీవంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ చేయాల్సింది పాదయాత్ర కాదు.. ఇద్దరు పార్టీల నేతలు కలిసి మోకాళ్ల యాత్ర చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి (Bandi Sanjay) బండి సంజయ్ కుమార్ అన్నారు. గత పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన తప్పులను ఒప్పుకునే దమ్ముందా? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి చేతనైతే 6 గ్యారంటీలపై పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు(Bandi Sanjay). కరీంనగర్జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట, బెజ్జంకి మండలాల్లో పర్యటించిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.‘మూసీ పునరుజ్జీవంపైన సీఎం పాదయాత్ర చేస్తానంటున్నడు. ఇప్పుడేమో కేటీఆర్ కూడా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తాడట. పాదయాత్ర చేసిన తర్వాత మీరిద్దరూ కలిసి బహిరంగ సభ పెట్టుకుని రాహుల్ గాంధీ, కేసీఆర్ లను పిలుచుకోండి. గత పదేండ్లలో ప్రజలను ఏ విధంగా మోసం చేశామో, అవినీతికి పాల్పడ్డామో బీఆర్ఎస్ నేతలు చెప్పుకోండి. 6 గ్యారంటీలపై ప్రజలను చేసి గద్దెనెక్కినంక వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు చెప్పుకోండి. సిగ్గుండాలే. అసలు కాంగ్రెస్ వన్నీ ఉత్తి మాటలే. ఉత్తర కుమార ప్రగల్భాలే. వాళ్ల చేతలకు మాటలకు పొంతనే లేదు. దీపావళికి ముందే రాజకీయ బాంబులు పేలుతాయన్నరు. పండుగనాడు అందరి ఇండ్లలో పటాకులు పేలినయ్ కానీ… కాంగ్రెసోళ్ల రాజకీయ బాంబు మాత్రం తుస్సుమంది. ఎందుకంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలూ ఒక్కటే. కలిసి డ్రామాలాడుతున్నయ్. మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ నేతలు డ్రామాలాడుతున్నరు. రూ.లక్షన్నర కోట్లు దోచుకునే కుట్రకు తెరదీస్తున్నరు. వీటిపై మేం నిలదీస్తుంటే… మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచే యుద్ధం ప్రారంభించిందని అనడం సిగ్గు చేటు. యుద్ధం సంగతి తరువాత… ముందు యుద్ధప్రాతిపదికన ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి మీ దమ్ము చూపండి ’అని బండి సవాల్విసిరారు.
Also read:

