తెలంగాణలో కస్టోడియన్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా(సెపీ) సంరక్షణలో ఉన్న శత్రు ఆస్తుల (ఎనిమీ ప్రాపర్టీ)కు సంబంధించి మార్చి నెలాఖరులోపు రికార్డుల పరిశీలన, గ్రౌండ్ సర్వే పూర్తి చేసి లెక్క తేల్చాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి (Bandi) బండి సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఇవాళ ఉదయం బేగంపేటలోని హోటల్ టూరిజం ప్లాజాలో రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లోని ఎనిమీ ప్రాపర్టీస్ పై కేంద్ర మంత్రి బండి (Bandi) సంజయ్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తొలుత రంగారెడ్డి జిల్లాలోని ఎనిమీ ప్రాపర్టీస్ పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కొత్వాల్ గూడ, మియాపూర్ పరిధిలో ఉన్న వందలాది ఎకరాల ఎనిమి ప్రాపర్టీస్ పై పురోగతి ఏమిటని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సర్వే నెంబర్ల వారీగా పురోగతిని వివరించారు. కొన్ని స్థలాలు అన్యాక్రాంతమయ్యాయని, మరికొన్ని చోట్ల రైతులు ఆక్రమించుకున్నారని తెలిపారు. ఏండ్ల తరబడి పొజిషన్ లో ఉన్న రైతులకు అన్యాయం జరగకుండా, అదే సమయంలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్చి నెలాఖరులోపూ సర్వే, రికార్డుల పరిశీలన పూర్తి చేసి నివేదిక అందించాలని కోరారు.
తెలంగాణలో కస్టోడియన్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా(సెపీ) సంరక్షణలో ఉన్న శత్రు ఆస్తుల (ఎనిమీ ప్రాపర్టీ)కు సంబంధించి మార్చి నెలాఖరులోపు రికార్డుల పరిశీలన, గ్రౌండ్ సర్వే పూర్తి చేసి లెక్క తేల్చాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఇవాళ ఉదయం బేగంపేటలోని హోటల్ టూరిజం ప్లాజాలో రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లోని ఎనిమీ ప్రాపర్టీస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తొలుత రంగారెడ్డి జిల్లాలోని ఎనిమీ ప్రాపర్టీస్ పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కొత్వాల్ గూడ, మియాపూర్ పరిధిలో ఉన్న వందలాది ఎకరాల ఎనిమి ప్రాపర్టీస్ పై పురోగతి ఏమిటని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సర్వే నెంబర్ల వారీగా పురోగతిని వివరించారు. కొన్ని స్థలాలు అన్యాక్రాంతమయ్యాయని, మరికొన్ని చోట్ల రైతులు ఆక్రమించుకున్నారని తెలిపారు. ఏండ్ల తరబడి పొజిషన్ లో ఉన్న రైతులకు అన్యాయం జరగకుండా, అదే సమయంలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్చి నెలాఖరులోపూ సర్వే, రికార్డుల పరిశీలన పూర్తి చేసి నివేదిక అందించాలని కోరారు.
Also read:

