BANDI SANJAY : జనం ఛీ కొట్టినా బుద్ధిరాలేదా?

bandi sanjay counter

కరీంనగర్: కరీంనగర్​కదనభేరి సభలో మాజీ సీఎం కేసీఆర్​మాట్లాడిన కామెంట్లకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్(BANDI SANJAY) ​కౌంటర్​ఇచ్చారు. పచ్చి అబద్ధాలు, అభూతకల్పనలతో మళ్లీ ప్రజలను నమ్మించే యత్నం చేస్తున్నారని ఫైర్​అయ్యారు. కరీంనగర్ లోని మైత్రి హోటల్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సంజయ్​(BANDI SANJAY) మాట్లాడారు. ‘కేసీఆర్​ను తెలంగాణ సమాజం ఛీ కొట్టినా బుద్ధి రాలేదు. పాత అంశాలను తోడి సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు కుట్ర చేస్తుండు.

మాజీ ఎంపీ వినోద్ కుమార్ నిజాయితీపరుడైతే రూ.500 కోట్ల విలువైన భూదాన్ భూముల స్వాధీనంపై నోరెందుకు మెదపలేదు? వినోద్​వలస పక్షి. నేను లోకల్. కేసీఆరే పెద్ద అవినీతిపరుడు. కేంద్ర మంత్రిగా ఈఎస్ఐ, సహార కుంభకోణాల్లో భాగస్వామి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదకరమని ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది నిజం కాదా? రూ.లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ కు ప్రతీది చిన్న సమస్యగానే కన్పిస్తుంది. కాళేశ్వరం బాధ్యుడైన కేసీఆర్  ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? రాజకీయాల్లో బూతుకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్. ఆయన అబద్దాలను, మోసాలను జనం ఇక నమ్మరు. లోక్​సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ కు అభ్యర్థులే కరువయ్యారు. ఆ పార్టీలోని నేతలంతా ఇతర పార్టీలవైపు చూస్తున్నరు’అని బండి అన్నారు.

పాత అంశాలను తోడి సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు కుట్ర చేస్తుండు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ నిజాయితీపరుడైతే రూ.500 కోట్ల విలువైన భూదాన్ భూముల స్వాధీనంపై నోరెందుకు మెదపలేదు? వినోద్​వలస పక్షి. నేను లోకల్. కేసీఆరే(KCR) పెద్ద అవినీతిపరుడు. కేంద్ర మంత్రిగా ఈఎస్ఐ, సహార కుంభకోణాల్లో భాగస్వామి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదకరమని ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది నిజం కాదా? రూ.లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ కు ప్రతీది చిన్న సమస్యగానే కన్పిస్తుంది. కాళేశ్వరం బాధ్యుడైన కేసీఆర్(KCR)  ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? రాజకీయాల్లో బూతుకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్. ఆయన అబద్దాలను, మోసాలను జనం ఇక నమ్మరు. లోక్​సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ కు అభ్యర్థులే కరువయ్యారు. ఆ పార్టీలోని నేతలంతా ఇతర పార్టీలవైపు చూస్తున్నరు’అని బండి అన్నారు.