కాంగ్రెస్ ప్రభుత్వానికి 42% రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (RamChanderRao) ఆరోపించారు. నాంపల్లి పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు –
“కామారెడ్డిలో బీసీ ద్రోహ సభ నిర్వహిస్తున్నామని సీఎం అంటున్నారు. (RamChanderRao) బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది. కానీ, కాంగ్రెస్‌కు చేతకాకుంటే మేమే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాం” అని స్పష్టం చేశారు.
రాంచందర్ రావు మాట్లాడుతూ –
“285 జీవో సవరణ లేకుండా రిజర్వేషన్లు ఇవ్వలేరని మేము ముందే చెప్పాం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసి రెండేళ్లు దాటిపోయింది. మాకు చిత్తశుద్ధి ఉన్నందునే బీసీ బిల్లుకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చాం. ఎక్కడా వ్యతిరేకించలేదు. కానీ, జీవోల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న విధానం సరైంది కాదు” అని అన్నారు.
అలాగే ఆయన అన్నారు –
“42% రిజర్వేషన్లు అమలు చేస్తేనే కాంగ్రెస్‌కు కామారెడ్డిలో మాట్లాడే హక్కు ఉంటుంది. కేంద్రం భరతం పట్టడం కాదు. తెలంగాణ ప్రజలే కాంగ్రెస్ భరతం పట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి 24 నెలలుగా బీసీలపై రాజకీయం చేస్తున్నారు. ప్రెసిడెంట్‌కి బిల్లును టైమ్ లిమిట్ లేకుండా పంపారు. గవర్నర్‌కు పంపితే 60 రోజుల సమయం ఉంది. లీగల్ సమస్యలు లేకుండా జీవో తెస్తే మేము మద్దతు ఇస్తాం. బీజేపీలో బీసీల ద్రోహులు ఎవరూ లేరు” అని రాంచందర్ రావు అన్నారు.
Also read:
- Ponnam: కేంద్రం యూరియా ఇస్తలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
- Navya Nair: మల్లెపూలు తీసుకెళ్లినందుకు.. రూ.1.14 లక్షల ఫైన్

