మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత తన్నీరు హరీశ్ రావు (Harish Rao)పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తన ఫోన్ ట్యాప్ చేశారని పేర్కొంటూ బాచుపల్లికి చెందిన చక్రధర్ గౌడ్ హరీశ్ రావు (Harish Rao)పై పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన పోలీసులు ఆయనతో పాటు మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. హరీశ్ రావుపై సెక్షన్ 120 బీ, 386, 409,506, రెడ్ విత్ 34 ఐపీసీ తో పాటు 66 ఐటీయాక్ట్ కింద ఎఫ్ఐఆర్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఫోన్‌ట్యాపింగ్ కేసు విచారణలో ఉంది. బీఆర్ఎస్ హయాంలో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన పలువురు పోలీసు అధికారులను ఈ కేసులో అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయనను ఇండియాకు రప్పించేందుకు ప్రభుత్వం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇదే కేసుకు సంబంధించి ఇటీవలే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ ను పోలీసులు విచారించారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత తన్నీరు హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తన ఫోన్ ట్యాప్ చేశారని పేర్కొంటూ బాచుపల్లికి చెందిన చక్రధర్ గౌడ్ హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన పోలీసులు ఆయనతో పాటు మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. హరీశ్ రావుపై సెక్షన్ 120 బీ, 386, 409,506, రెడ్ విత్ 34 ఐపీసీ తో పాటు 66 ఐటీయాక్ట్ కింద ఎఫ్ఐఆర్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఫోన్‌ట్యాపింగ్ కేసు విచారణలో ఉంది. బీఆర్ఎస్ హయాంలో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన పలువురు పోలీసు అధికారులను ఈ కేసులో అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయనను ఇండియాకు రప్పించేందుకు ప్రభుత్వం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇదే కేసుకు సంబంధించి ఇటీవలే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ ను పోలీసులు విచారించారు.
Also read:

