Swiggy: స్విగ్గీ టీ షర్టుపై వచ్చి చైన్ స్నాచింగ్

Swiggy

ఉప్పల్‌ సెవెన్‌ హిల్స్‌ కాలనీలో ఆదివారం సాయంత్రం సంచలన ఘటన చోటు చేసుకుంది. (Swiggy) స్విగ్గీ టీ-షర్ట్‌‌ ధరించి వచ్చిన ఓ వ్యక్తి, వాకింగ్‌కు వెళ్తున్న ఓ వృద్ధురాలి (Swiggy) మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కుని పరారవ్వడానికి ప్రయత్నించాడు.

బాధితురాలు వెంటనే “దొంగ దొంగ” అని అరిచడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటపడారు. పక్కగల్లీలో దొంగను పట్టుకుని అక్కడికక్కడే దేహశుద్ధి చేశారు. అనంతరం చైన్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారమిచ్చారు.

తక్షణమే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, దొంగను అదుపులోకి తీసుకున్నారు. చైన్‌ను బలంగా లాగడంతో వృద్ధురాలి మెడపై స్వల్ప గాయాలు అయినట్టు పోలీసులు తెలిపారు.

ప్రాథమిక విచారణలో ఆ వ్యక్తి స్విగ్గీ డెలివరీ బాయ్‌ కాకుండా, ఆ కంపెనీ టీషర్ట్‌ను వేరే చోట దొంగిలించి ధరించి వచ్చాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కాలనీలో సీసీ కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు ఉప్పల్‌ పోలీసులు తెలిపారు.

Also read: