చేవెళ్ల (ChevellaTragedy) సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెలు దుర్మరణం పాలవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమై విలపిస్తున్నారు. (ChevellaTragedy) మృతుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై ప్రభుత్వం, ఆర్టీసీ, కేంద్రం తరఫున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
➡️ రాష్ట్ర ప్రభుత్వం:
మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
➡️ ఆర్టీసీ:
తమ తరఫున రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించింది.
➡️ గాయపడిన వారికి:
రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా అందించడంతో పాటు, వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించనుంది.
ప్రధాని సంతాపం:
ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సహాయ నిధి (PMNRF) నుంచి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
చేవెళ్ల పరిసర ప్రాంతాల్లో వాతావరణం దుఃఖభరితంగా మారింది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో స్థానికులు పెద్ద ఎత్తున చేరి మృతులకు నివాళులర్పించారు.
Also read:
