CM: 100 కోట్లు మాకొద్దు

CM

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో స్కిల్స్‌ ఇండియా యూనివర్సిటీకి ఇటీవల అదానీ గ్రూప్‌ ప్రకటించిన రూ.100 కోట్ల విరాళాన్ని స్వీకరించరాదని నిర్ణయించింది. డబ్బులు ట్రాన్స్​ఫర్​చేయొద్దని అదానీ గ్రూపునకు లేఖ రాసింది. ఈమేరకు జూబ్లీహిల్స్​లోని తన నివాసంలో (CM) సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. అదాని గురించే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని.. ఈ వ్యవహారాన్ని మొదటి నుంచి రాహుల్​ప్రశ్నిస్తూనే ఉన్నారని తెలిపారు. వివాదాలు, ఆరోపణలతో అదాని విరాళం ప్రభుత్వానికి వద్దని ఆయనకు లేఖ​ రాశామని చెప్పారు. కావాలని కొందరు తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. (CM) బీఆర్‌ఎస్‌ సర్కారు అదానికి గతంలో ఎన్నో ప్రాజెక్టులు ఇచ్చిందని.. కేంద్రంతో బీఆర్ఎస్ ​పదేండ్లు అంటకాగా బయ్యారం, కాజీపేట ఫ్యాకర్టీలు రాకుండా చేసిందని ఫైర్​అయ్యారు. కేసీఆర్ లాగా తాము ఎవరికీ​ వంగి వంగి దండాలు పెట్టమన్నారు.

Image

నోరు తెలిస్తే అబద్దాలు మాట్లాడటం గులాబీ పార్టీకి అలవాటైందన్నారు.‘సోషల్​రెస్పాన్సిబిలిలటీ కింద రూ.100 కోట్లు ఇస్తామని అదాని గ్రూప్​చెప్పింది. ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి ప్రభుత్వం ఒక్క రూపాయి తీసుకోలే. అదాని గ్రూప్​నుంచి కూడా మాకు ఒక్క రూపాయి రాలేదు. యంగ్​ఇండియా స్కిల్​వర్సిటీకి చాలా సంస్థలు నిధులిచ్చేందుకు ముందుకొచ్చాయి. పెట్టుబడులు పెట్టేవారికి అప్పనంగా ఆస్తులు కట్టబెట్టడం ఉండదు. రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో అందరికీ అవకాశం ఉంటుంది. చట్టప్రకారం, నిబంధనల ప్రకారం టెండర్లు ఇవ్వడం సాధారణం. దేశంలో ఏ సంస్థలకైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకొనే హక్కు ఉంటుంది. గొప్ప సంకల్పంతో లక్షలాది మంది నిరుద్యోగులకు సాంకేతిక నైపుణ్యం నేర్పించే లక్ష్యంతో స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించాం. గొప్ప సదుద్దేశంతో ప్రారంభించిన ఈ వర్సిటీ వివాదాలకు లోను కావడం మంత్రివర్గ సహచరులకు, నాకు, ప్రభుత్వానికి ఇష్టంలేదు. అనవసర వివాదాల్లోకి మమ్మల్ని లాగొద్దు’ అని సూచించారు.

Image

ఎన్నిసార్లైనా ఢిల్లీకి పోతం 
‘ఇవాళ్టి ఢిల్లీ టూర్​కు రాజకీయాలతో సంబంధంలేదు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కూతురి వివాహం కోసమే హస్తినకు వెళ్తున్నం. మరో ప్రాధాన్యం లేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై రేపు ఎంపీలతో సమావేశమవుతాం. అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలిసి సమస్యల్ని వివరిస్తం. 28 సార్లు ఢిల్లీ వెళ్లానని కొందరు విమర్శిస్తున్నారు. నేను వారిలా మోదీ కాళ్లు పట్టుకునేందుకు, గవర్నర్ నుంచి అనుమతి ఇవ్వొద్దు అనో.. కేసుల నుంచి తప్పించుకునేందుకో.. పైరవీలు చేయడానికో.. బెయిల్‌ కోసం ఢిల్లీకి వెళ్లలేదు. కేంద్రం నుంచి మనకు రావాల్సినవి రాబట్టుకోవాలి. ఫామ్​హౌస్​లో పడుకుంటే ప్రయోజనం ఉండదు. అవసరమైతే ఢిల్లీకి ఎన్నిసార్లయినా వెళ్తాం. రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడుగుతాం. మనకు న్యాయంగా రావాల్సినవి కేంద్రంతో కొట్లాడి సాధించుకుంటం’అని సీఎం రేవంత్​స్పష్టంచేశారు.

బీజేపీని తిరస్కరించారు
‘మహారాష్ట్ర, నాందేడ్ లోక్ సభ ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. వయనాడ్ లో ప్రియాంక గాంధీకి రాహుల్ గాంధీ కంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది. రాష్ట్రానికి ఒకరకంగా కేంద్రానికి ఒకరకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. దేశంలో ఎక్కడ చూసినా బీజేపీని తిరస్కరించారు. బీజేపీ నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారురో అర్థం కావడంలేదు’ అని రేవంత్​అన్నారు.

Also read: