తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరును ప్రతిపాదిస్తూ (CM) సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు కావాలని కులం ప్రస్తావన తీసుకొస్తున్నారని పరోక్షంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ని ఉద్దేశించి (CM) అన్నారు. తాము పొట్టి శ్రీరాములుకు వ్యతిరేకం కాదని, ఆ మహనీయుడి త్యాగ ఫలితంగానే 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. సురవరం పేరును తెలుగు వర్సిటీకి పెట్టడాన్ని కులం, ప్రాంతం కోణంలో చూడొద్దని అన్నారు. తెలంగాణ వైతాళికుల పేర్లను వర్సిటీలకు పెట్టుకుంటూ వస్తున్నామని అందులో భాగంగానే హెల్త్ వర్సిటీకి కాళోజీ, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి జయశంకర్, వెటర్నరీ వర్సిటీకి పీవీ నరసింహారావు, హార్టికల్చర్ వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లు పెట్టుకుంటూ వచ్చారని అన్నారు. సీపీఐ ఎమ్మెల్యే ప్రతిపాదన మేరకు ఈ బిల్లు ప్రవేశపెట్టినట్టు చెప్పారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరామలు పేరు పెట్టాలని ప్రతిపాదిస్తూ కేంద్రానికి లేఖ రాస్తామని, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా దివంగత మాజీ సీఎం రోశయ్య 16 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టారని, వారి త్యాగానికి గుర్తుగా వారు నివసించిన బల్కంపేట ఏరియాలో ఉన్న నేచర్ క్యూర్ ఆస్పత్రికి రోశయ్య నేచర్ క్యూర్ ఆస్పత్రి అని పేరు పెడుతున్నట్టు చెప్పారు. అక్కడ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. రోశయ్య వర్ధంతి, జయంతులను అధికారంగా నిర్వహిస్తామని అన్నారు. తమకు ఆర్య వైశ్యులంటే గౌరవమని సీఎం చెప్పారు. ముఖ్యమంత్రి తెలుగు యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా మార్చుతూ ప్రవేశపెట్టిన బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది.
తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరును ప్రతిపాదిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు కావాలని కులం ప్రస్తావన తీసుకొస్తున్నారని పరోక్షంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ని ఉద్దేశించి అన్నారు. తాము పొట్టి శ్రీరాములుకు వ్యతిరేకం కాదని, ఆ మహనీయుడి త్యాగ ఫలితంగానే 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. సురవరం పేరును తెలుగు వర్సిటీకి పెట్టడాన్ని కులం, ప్రాంతం కోణంలో చూడొద్దని అన్నారు. తెలంగాణ వైతాళికుల పేర్లను వర్సిటీలకు పెట్టుకుంటూ వస్తున్నామని అందులో భాగంగానే హెల్త్ వర్సిటీకి కాళోజీ, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి జయశంకర్, వెటర్నరీ వర్సిటీకి పీవీ నరసింహారావు, హార్టికల్చర్ వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లు పెట్టుకుంటూ వచ్చారని అన్నారు. సీపీఐ ఎమ్మెల్యే ప్రతిపాదన మేరకు ఈ బిల్లు ప్రవేశపెట్టినట్టు చెప్పారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరామలు పేరు పెట్టాలని ప్రతిపాదిస్తూ కేంద్రానికి లేఖ రాస్తామని, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా దివంగత మాజీ సీఎం రోశయ్య 16 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టారని, వారి త్యాగానికి గుర్తుగా వారు నివసించిన బల్కంపేట ఏరియాలో ఉన్న నేచర్ క్యూర్ ఆస్పత్రికి రోశయ్య నేచర్ క్యూర్ ఆస్పత్రి అని పేరు పెడుతున్నట్టు చెప్పారు. అక్కడ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. రోశయ్య వర్ధంతి, జయంతులను అధికారంగా నిర్వహిస్తామని అన్నారు. తమకు ఆర్య వైశ్యులంటే గౌరవమని సీఎం చెప్పారు. ముఖ్యమంత్రి తెలుగు యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా మార్చుతూ ప్రవేశపెట్టిన బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది.
Also read:

